చిత్ర పరిశ్రమ అంటేనే నటన కొందరు నేను ఒకే విధమైన క్యారెక్టర్లు చేయాలని ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ అలా చేయడం కుదరదు. ఆవకాశం వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికయినా సిద్ధపడి ఉండాలి. అలాంటప్పుడు మీలో ఉన్న నటుడికి గుర్తింపు ఉంటుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు సైతం సమయానికి తగ్గట్టుగా పాత్రలతో ఎలాంటి గెటప్ లైన చేయడానికి సిద్ధమై ఉన్నారు. అలా టాలీవుడ్ ఆడ గెటప్ వేసి మెప్పించిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
బాలకృష్ణ:
నటసింహం నందమూరి బాలకష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించిన బాలకృష్ణ పాండురంగడు సినిమాలో లేడీ గెటప్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
చిరంజీవి:
150కు పైగా చిత్రాలలో నటించిన చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ గా ఎన్నో హిట్ చిత్రాలను అందుకున్నాడు. అన్ని సినిమాలలో తన హీరోయిజం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే చిరంజీవి చంటబ్బాయి సినిమాలో లేడీ గెటప్ లో నటించి ప్రేక్షకులలో ఆనందాన్ని రెట్టింపు చేశాడు.
రాజేంద్ర ప్రసాద్:
ఎన్నోకామీడి చిత్రాలలో హీరోగా నటించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ తన మాట తీరు తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే రాజేంద్రప్రసాద్ లేడీ గెటప్ లో మేడమ్, వివాహ భోజనంబు, ఆల్ రౌండర్ చిత్రాలలో నటించి అందరినీ మెప్పించారు.
వీ.కే నరేష్:
మరో సీనిమర్ హీరో నరేష్ కూడా ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రలలో నటించిన నరేష్ చిత్రం భళారే విచిత్రం సినిమాలో లేడీ దుస్తులతో ఆయన చేసిన నటనకు ఎన్నో ప్రశంసలు కురిపించడంతో పాటు, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అల్లు అర్జున్:
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. అల్లు అర్జున్ తన మొదటి సినిమా గంగోత్రి సినిమాలోనే అల్లు అర్జున్ లేడీ గెటప్ లో నటించారు. అంతేకాకుండా డ్యూయెట్ కూడా చేశాడు.
ఇక మీరే కాకుండా వెంకటేష్ , అల్లరి నరేష్, సుమంత్ ,మంచు మనోజ్ , రజినీకాంత్ , విక్రమ్, విశాల్, శివ కార్తికేయన్, అలీ, విజయ్ సేతుపతి, లారెన్స్, శరత్ కుమార్, కమలహాసన్ ఇలా ఎంతోమంది స్టార్ హీరోలు లేడీ గెటప్స్ తో ప్రేక్షకులను మెప్పించారు.