రమా కంటే ముందే రాజమౌళి ఆ స్టార్ హీరోయిన్‌ని ప్రేమించాడా…పెళ్లి వరకు వెళ్లారా ?

రాజమౌళి అంటే ప్రస్తుతం చిత్రపరిశ్ర‌మ‌లో స్టార్ హీరోలు కంటే ఎక్కువ డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. శాంతినివాసం అనే ఈటీవీ సీరియల్ కి రాజమౌళి దర్శకత్వం వహించి.. ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడుగా ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ దర్శకులలో ఒకరిగా నిలిచాడు.

రాజమౌళి ఈ స్థాయిలో నిలిచాడు అంటే దానికి ముఖ్య కారణం ఆయన భార్య రమా అని కూడా చెప్పాలి.
ర‌మ ఎప్పుడూ తన భర్తకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. అలాగే రమా డిజైన్ చేసే కాస్ట్యూమ్స్ రాజమౌళి సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటాయి. రాజమౌళి- రమాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాజ‌మౌళిని పెళ్లి చేసుకునే ముందు ర‌మాకు మ‌రో వ్య‌క్తితో పెళ్లి జ‌రిగి కార్తీకేయ పుట్టాడు. వారికి మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు.

క్కడ ఎవరికీ తెలియని ఇంకో విషయం ఏమిటంటే రాజమౌళి తన చదువుకునే రోజుల్లోనే ఓ స్టార్ హీరోయిని ఎంతగానో ప్రేమించాడట. అంతేకాకుండా ఆ స్టార్ హీరోయిన్ కోసం రాత్రులు కాలేజ్ గోడ దూకి మరి ఆమె ఇంటి చుట్టూ తిరిగేవారట. అంతలా రాజమౌళి ఆ స్టార్ హీరోయిన్ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలని భావించాడట.

తన ఇష్టాన్ని ఆ హీరోయిన్ కు చెప్పలేకపోయాడు రాజమౌళి.. అదే సమయానికి ఆ హీరోయిన్ కి పెళ్లి కూడా జరిగిపోయింది. ఆ తర్వాత రాజమౌళి ప్రేమ దోమ పక్కనపెట్టి తన స్టడీస్ కంప్లీట్ చేసి సినిమా రంగంలో అడుగు పెట్టాడు. త‌న అన్న కీర‌వాణి ఇంట్లో రమాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఉంటున్నారు.

రాజ‌మౌళి ఓ హీరోయిన్‌ను ప్రేమించాడ‌న్న‌ది అత‌డి స‌న్నిహితుల ద్వారానే బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం. అయితే ఇందులో వాస్త‌వ అవాస్త‌వాల సంగ‌తి ఏమోగాని.. రాజ‌మౌళి చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా ప్ర‌పంచంలోనే పెరిగాడు. ఏ హీరోయిన్‌ను చూసైనా ఇష్ట‌ప‌డి ఉంటాడేమో .. ఆ య‌వ్వ‌న కాలంలో.. అంత‌కు మించి ఏం ఊహించుకోవ‌క్క‌ర్లేదు.