ఎంత డబ్బు ఇచ్చినా ఆ పని మాత్రం చేయను.. ఆ డైరెక్టర్‌కు శ్రీలీల మొహం మీదే ఇచ్చేసిందిగా…!

ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ యంగ్ బ్యూటీ శ్రీ లీల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరూ శ్రీలీల‌ వెనకలే పడుతున్నారు. స్టార్ హీరోయిన్లు ఎంతమంది ఉన్నా సరే అందరి చూపు శ్రీ లీలా పైనే ఉంది. ఇప్పటికే ఈ యంగ్ బ్యూటీ చేతిలో పవన్ కళ్యాణ్ నుంచి బాలకృష్ణ, మహేష్ బాబు వరకు అందరి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇండస్ట్రీకి వచ్చిన రెండు సంవత్సరాలకే టాలీవుడ్‌ను తన క‌నుసైగ‌ల‌తో శాసిస్తుంది శ్రీలీల‌. ఇదే స‌మ‌యంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ వద్దకు తాజాగా ఒక ప్రాజెక్ట్ వచ్చిందట. ఓ యంగ్ దర్శకుడు శ్రీలీలను కలిసి ఓ కథ వినిపించాడట. అయితే ఆ స్టోరీ విన్న వెంటనే శ్రీలీల తాను ఈ సినిమా చేయనని మొహం మీదే చెప్పేసిందట. దానికి ప్రధాన కారణం అదొక బోల్డ్ సబ్జెక్ట్ ఉన్న స్టోరీఅట.

ఆ కథలో హీరోయిన్ రోల్ ఎంతో బోల్డుగా ఉంటుందట. ఆ కారణంగానే శ్రీలీలా ఆ ప్రాజెక్ట్‌కు నో చెప్పిందట. అయితే ఆ సదరు దర్శకుడు మాత్రం శ్రీలీల‌ నో చెప్పిన వినకుండా ఆమెను ఫోర్స్ చేయబోయాడట. ఈ ప్రాజెక్ట్‌కు మీరే సూట్ అవుతారు అంటూ భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశాడట. దాంతో శ్రీలీలకు ఎక్కడలేని కోపం వచ్చిందట. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా చస్తే ఆ సినిమా చేయను అంటూ ఆ డైరెక్టర్‌కు మొహం మీదే ఇచ్చి పడేసిందట.

నేను న‌టించే సినిమాల విషయంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటాలని నేను అనుకోవటం లేదు అని తెగేసి చెప్పేసిందట. ఒకవేళ ఆ రూల్స్ దాటాల్సి వస్తే సినిమాలు చేయటమే మానేస్తానని అంతేతప్ప మనసుకు ఇష్టం లేని ఎన్ని కోట్లు ఇచ్చినా చేయనని శ్రీలీల‌ చెప్పిందని ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్‌గా మారింది.