ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పదేళ్లకు పైగా ఒక వెలుగు వెలిగింది సమంత. ప్రస్తుతం సమంతకు టాలీవుడ్లో ఛాన్సులు తగ్గాయి. తెలుగులో సమంత గ్లామర్ షోస్ లో కనిపించి చాలా కాలమయ్యింది. నాగచైతన్యతో విడాకులు తర్వాత ఆమె యశోద, శకుంతలం లాంటి లేడీ ఓరీయంటెడ్ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఖుషి మూవీ తప్ప ఆమె చేతుల్లో తెలుగు ప్రాజెక్ట్ లు లేవు. ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ అంటే సమంత, పూజహెగ్డే పేరులే వినిపించేవి.. కానీ ఇప్పుడు ఎవరు వాళ్ళని పట్టించుకోవడం లేదు.
చైతుతో విడాకుల తర్వాత పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్లో నటించింది. ఈ సాంగ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారుతుంది అనుకుంటే వరుస డిజాస్టర్లు రావడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో తన లక్ పరీక్షించుకోవడానికి సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.
ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ షో చేస్తూ సినిమా ఛాన్సులు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ తాను ఇంకా లైమ్లైట్లోనే ఉన్నానని ఫ్రూవ్ చేసుకునేందుకు అష్టకష్టాలు పడుతూ ఉంటుంది. గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే తప్పుకోవడంతో త్రివిక్రమ్ సమంతను తీసుకుంటాడు అనుకున్నారు.
అయితే త్రివిక్రమ్ మాత్రం పూజ హెగ్డే ప్లేస్లో సంయుక్త మీనన్ ని తీసుకున్నారు. సమంతకు ఎవ్వరూ అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇక టాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తుందో లేదో ఇంకా చూడాలి. ఒక వేళ సమంత ఇక తెలుగు సినిమాల్లో కనిపించకపోతే ఆమె ఫ్యాన్స్ ఆవేదన వర్ణించలేం.