ఆ ఒక్క కార‌ణంతో రెమ్యున‌రేష‌న్లే తిరిగిచ్చేసిన స్టార్ హీరోలు.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

గ‌త కొంత‌కాలంగా చాలా సినిమాలు టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రిలీజై డిజాస్టర్స్‌గా నిలిచాయి. వారు అనుకున్న రేంజ్ లో సినిమా హిట్ కాకపోవడంతో నిర్మాతలు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది స్టార్ హీరోలు వారు తీసుకున్న రెమ్యునరేష‌న్ తిరిగి ఇచ్చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలా త‌మ రెమ్యున‌రేష‌న్లే తిరిగి ఇచ్చేసిన హీరోలు ఎవ‌రో చూద్దాం. నిజంగానే నిర్మాత‌ల‌ను ఆదుకున్నందుకు వీరికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

బాలకృష్ణ :
క్రిష్‌ దర్శకత్వంలో నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ హీరోగా హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి భారీ అంచనాలతో రిలీజైంది. కాని ఈ సినిమాకు పెట్టిన బ‌డ్జెట్ కంటే అనుకున్న రేంజ్ లాభాలు రాలేదు. దీంతో నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ సినిమాకు బాల‌య్య తీసుకున్న రెమ్యూనరేషన్లో కొంత‌ తిరిగి ఇచ్చేసాడట.

మహేష్ బాబు :
మహేష్ బాబు హీరోగా అనుష్క హీరోయిన్‌గా నటించిన ఖలేజా సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చినా ఈ సినిమా అంతగా క్లిక్ కాలేదు. దీంతో డిస్టిబ్యూటర్స్‌కు భారీ నష్టం వచ్చింది. వాళ్లు నష్టపోకూడదని ఉద్దేశంతో మహేష్ బాబు రెమ్యూనరేషన్లో స‌గం తిరిగి ఇచ్చేసాడట.

అఖిల్ :
అక్కినేని అఖిల్.. నాగార్జున సినీబ్యాక్‌గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. అఖిల్ హీరోగా – సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించి ఇటీవల రిలీజ్ అయిన‌ ఏజెంట్ సినిమా పెద్ద‌ డిజాస్టర్. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకూడదని ఉద్దేశంతో అఖిల్ తన మొత్తం రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేశాడు.

చిరంజీవి :
డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా భారీ అంచనాలతో తెరపైకి వచ్చినా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు తీసుకున్న‌ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసాడట చిరంజీవి. ఈ సినిమా నిర్మాత చిరు త‌న‌యుడు రామ్‌చ‌ర‌న్ కావ‌డం విశేషం.

రజనీకాంత్ :
సురేష్ కృష్ణ దర్శకత్వంలో మనిషా కొయిరాల హీరోయిన్‌గా రజిని కాంత్ హీరోగా తెరకెక్కిన బాబా సినిమా డిజాస్టర్ కావడంతో నిర్మాతలు నష్టపోకూడదని ఉద్దేశంతో రజినీకాంత్ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ చాలా వ‌ర‌కు రిట‌ర్న్ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా బ్యాగ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన స్టైల్ లో కథలు ఎంచుకుంటూ కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ నటించిన జానీ, కొమరంపులి, అజ్ఞాతవాసి సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్‌ను తిరిగి ఇచ్చేశాడు.

రామ్ చరణ్ :
గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా – జెనీలియా హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా ఆరెంజ్. రాంచరణ్ ఈ సినిమాల్లో లవర్ బాయ్‌లా కనిపిస్తాడు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. రామ్ చరణ్ ఈ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేశాడు. ఇలా చాలామంది స్టార్ హీరోల‌తో పాటు హీరోయిన్స్ కూడా వాళ్లు నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో నిర్మాతలు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో వారి రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేశారు.