ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు హీరో హీరోయిన్లుగా నటించి ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకుంటున్నారు. ఇలా ప్రేమించి వివాహాలు చేసుకున్న వారంతా కలిసి ఉన్నారా అంటే లేదనే చెప్పాలి. పట్టుమని పదేళ్లు కూడా కలిసి కాపురం చేయకుండానే విడాకులు తీసుకుంటున్నారు. ఇలాంటి జంటలకు భిన్నంగా ఉంది నాగార్జున – అమల జంట. అసలు విషయానికొస్తే నాగార్జున.. అమల కంటే ముందు దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ఏకైక కుమార్తె లక్ష్మీని వివాహం చేసుకొని నాగచైతన్యకి జన్మనిచ్చాడు.
ఆ తర్వాత ఎవో మనస్పర్ధలు కారణంగా ఆమెకి విడాకులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకప్పటి టాలీవుడ్ క్యూట్ కప్పుల్స్ అయిన అమల – నాగార్జున ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్ పుట్టాడు. వీరిద్దరి కాంబోలో నిర్ణయం, శివ లాంటి బ్లాక్బస్టర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. వీరి పెళ్లి జరిగి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ జంట ఎంతో అన్యోన్యంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు.
గతంలో అమల హీరోయిన్గా నటించే సమయంలో ఎంతోమంది స్టార్ హీరోలు ఐ లవ్ యు.. అంటూ అమల వెంటపడేవారట. కానీ నాగార్జున ప్రేమించిన తర్వాత వీరంతా కామ్ అయిపోయారట. కానీ ఒక స్టార్ హీరో మాత్రం నాగార్జున – అమల ప్రేమించుకుంటున్నారని తెలిసిన పెళ్లి చేసుకోమంటూ టార్చర్ చేసేవాడట. అమల ఈ విషయాన్ని నాగార్జునతో చెప్పడంతో నాగార్జున కోపంతో రంగంలోకి దిగి ఆ స్టార్ హీరోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట.
దాంతో ఆ స్టార్ హీరో మళ్ళీ అమలవైపు కన్నెత్తి కూడా చూడలేదట. ఆ తర్వాత కొంతకాలానికి అమల – నాగార్జున ఇద్దరు ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫెయిర్ లైఫ్ నీ ఎంతో హ్యాపీగా గడుపుతున్నారు.