సమంత – నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట పెళ్లైన కొంతకాలానికే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతూనే వచ్చాయి. వీరిద్దరు విడిపోయి యేడాదిన్నర దాటుతున్నా ఇప్పటకీ వీరి విడాకుల వార్తలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటాయి.
ఇక వీరువిడిపోవడానికి కారణం సమంతనే అంటూ.. కాదు చైతూనే అంటూ, లేదు అమల సమంతను టార్చర్ చేయడం వల్లే వీరిద్దరూ విడిపోయారంటు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. విడాకుల తర్వాత ఎవరి సినిమా లైఫ్ వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల తాజాగా వీరిద్దరి విడాకులపై మరో వార్త బయటకు వచ్చింది.
సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు ఒక స్టార్ హీరో బంధుమిత్రులందరిని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఎరేంజ్ చేసి మరి పండగ చేసుకున్నాడట. ఆ స్టార్ హీరో ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉందట. వీరిద్దరూ పెళ్లి చేసుకోక ముందు ఆ స్టార్ హీరో సమంతకు ప్రపోజ్ చేశాడట. సమంత అతడిని రిజెక్ట్ చేయడంతో ఆమెపై కోపం పెంచుకున్న ఆ స్టార్ హీరో.. వారిద్దరు విడాకులు తీసుకున్నారన్న ఆనందంలో బంధువులకి రీజన్ కూడా చెప్పకుండా పార్టీ ఇచ్చి మరి సంబరాలు చేసుకున్నాడట.
ఈ వార్త రకరకాలుగా చెవులు మారి ప్రస్తుతం బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతోంది. దీంతో చాలామంది ప్రేమించిన అమ్మాయి విడాకులు తీసుకుంటే ఇంత ఆనందపడతాడా ? ఇదెక్కడి ఆనందం రా దరిద్రుడా అంటూ.. బూతులు తిడుతున్నారు. ఇక సమంతకు పెళ్లికి ముందే ఒకటి రెండు ఎఫైర్లు ఉన్న సంగతి తెలిసిందే.