స్టూడెంట‌ర్ నెంబ‌ర్ 1, ఆది గాలి వాటం హిట్లు…. ఎన్టీఆర్‌కు అంత సీన్ లేద‌ని సెటైర్లు… మైండ్ బ్లాక్ చేశాడు..!

ఎన్టీఆర్ టీనేజ్ లో ఉన్నప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హిట్ కొట్టి ఒక్క‌సారిగా సెన్షేష‌న‌ల్ హీరో అయ్యాడు. ఆ త‌ర్వాత సుబ్బు ఫ్లాప్ అయినా ఆదితో సూపర్ హిట్ కొట్టాడు. ఆది సినిమా తర్వాత అల్లరి రాముడు, నాగ‌ సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇంకా ఎన్టీఆర్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఒక్కసారిగా విమర్శలు వచ్చేసాయి.

అప్పుడు సింహాద్రి మూవీతో అందరూ నోళ్లు మోహించేలా బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎన్టీఆర్. ఆ తర్వాత తీసిన ఎన్నో సినిమాలు హిట్ అయినా కానీ ఒక్కసారిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ అంటే దేశ‌వ్యాప్తంగా తెలియని సినీ అభిమానులు ఎవ్వ‌రూ లేరు. పాన్‌ ఇండియా హీరోగా దూసుకుపోతోన్న‌ ఎన్టీఆర్ కి టీనేజ్ లో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఓ సినిమా అంటే ఇష్టం.

తనకి చిన్నప్పటినుండి కూడా చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమా అంటే ఇష్టం అట‌. కానీ ఆ విషయం ఎప్పుడూ బయట పెట్టలేదు. ఎన్టీఆర్ కి రుద్రవీణ సినిమా అంటే ఇష్టమని త్రిబుల్ ఆర్ సినిమా ప్ర‌మోష‌న్ల టైంలో చెప్పాడు. 1988లో రుద్ర‌వీణ సినిమా రిలీజ్ అయింది. చిరంజీవి చేసిన ఈ సినిమాని నాగబాబు నిర్మించాడు.

ప్ర‌ఖ్యాత త‌మిళ ద‌ర్శ‌కుడు కె. బాల‌చంద‌ర్ దర్శకత్వంలో రూపొందిందీ ఈ రుద్రవీణ. రుద్రవీణ సినిమాలో చూపించిన అప్పటి సమాజ పరిస్థితులు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు మిగిలిపోయాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర‌ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కొత్తగా కనిపిస్తుంది. ఆ తర్వాత దేవర 2 కూడా వస్తుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.