అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై జబర్దస్త్ షోతో యాంకర్ గా పరిచయమైంది అనసూయ. తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ వెండి తెరపై ఛాన్సులను సంపాదించుకుంది. ప్రస్తుతం వెండితెరపై వరుస ఛాన్సులతో సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్న అనసూయ రాత్రి, పగలు తేడా లేకుండా షూటింగ్లో పాల్గొంటుంది.
ప్రస్తుతం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనున్న పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది అనసూయ. పుష్ప పార్ట్ 1 లో విలన్ గా దాక్షాయిని రోల్ ప్లే చేసిన అనసూయ ఆమె పాత్రకు 100% న్యాయం చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పుష్ప 2 లో పుష్ప పై పగ తీర్చుకోబోతున్న దాక్షయనిని మనం చూడబోతున్నాం.
ఇక ఇటీవల అనసూయ పుష్ప 2 షూటింగ్లో అర్ధరాత్రి వరకు బిజీగా గడిపిన ఒక ఫోటోను సమయంతో సహా మెన్షన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో చాలామంది నెటిజన్స్ అనుసుయకు రాత్రంతా నిద్ర లేకుండా చేస్తున్నారా ..? సుకుమార్ గారు అంటూ పాపం అనసూయ అలసిపోతున్నావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 ఇప్పట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కాబోతుందట.