నిఖిల్ స్పైలో రానా రోల్ మిస్ అయిన స్టార్ హీరో… నిమిషం కోసం రానా ఏకంగా అంత పుచ్చుకున్నాడా..!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తీకేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ త‌ర్వాత అదే పాన్ ఇండియా రేంజ్‌లో న‌టించిన సినిమా స్పై. ఈ సినిమాలో ఈ వారాంతంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ డెత్ మిస్ట‌రీ, ఫైల్స్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింద‌న్న ప్ర‌చారంతో స్పై రిలీజ్‌కు ముందు మంచి అంచ‌నాలు ఉన్నాయి.

అయితే సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. ఇక స్పై లో స్పెషల్ అట్రాక్షన్ ద‌గ్గుబాటి రానా. ఈ సినిమాలో రానా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడన్న విష‌యం సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందు వరకు ఎవరికీ తెలియదు. అంత సీక్రెట్‌గా ఉంచారు. అయితే ఈ పాత్ర ను ఎవ‌రితో చేయించాల‌న్న విష‌యంలో పెద్ద డిస్క‌ర్ష‌న్లే జ‌రిగాయ‌ట‌.

అక్కినేని హీరో నాగ్ చైతన్య పేరు ప‌రిశీలించార‌ట‌. చైతు కూడా అవకాశం వుంటే చేద్దామనే అనుకున్నార‌ట‌. అయితే రిలీజ్ డేట్ ముందుగానే జూన్ 29 అనుకున్నారు. ఆ త‌ర్వాత చైతు విదేశాల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. చైతుతో షూట్ చేస్తే టైం స‌రిపోద‌నే అప్ప‌టిక‌ప్పుడు రానాతో ఈ పాత్ర చేయించాడ‌ట‌. ఈ పాత్ర కోసం నిఖిల్ స్వ‌యంగా త‌న‌కు క్లోజ్ అయిన రానాను అప్రోచ్ అయ్యి ఓకే చేయించుకున్నాడ‌ట‌.

ఈ సినిమా రిలీజ్‌కు ఓ ప‌ది రోజుల ముందే ఈ ఎపిసోడ్ షూట్ చేశారు. మామూలుగా అయితే క‌థ ప్ర‌కారం కొన్ని విజువ‌ల్స్ కూడా ఉంటాయి. అంత టైం లేక‌పోవ‌డంతో పేపర్ కటింగ్స్ బ్యాక్ డ్రాప్ లో చూపిస్తూ సరిపెట్టారంటున్నారు. ఇక రానా నిఖిల్‌కు ఎంత స‌న్నిహితుడు అయినా కూడా జ‌స్ట్ అలా క‌నిపించినందుకు గాను ఏకంగా రు. 40 ల‌క్ష‌లు పుచ్చుకోవ‌డంతో పాటు జీఎస్టీ కూడా అద‌నంగా ఇచ్చార‌ని టాక్ ?