సమంత.. నాగచైతన్య కంటే ముందే ఆ స్టార్ హీరోను భ‌ర్త‌ను చేసుకోవాల‌నుకుందా..!

చిత్ర పరిశ్రమలో ఉండే సెలబ్రెటీల లవ్.. డేటింగ్.. ఎఫైర్.. విడాకులు ఎప్పుడు చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ రీసెంట్ టైమ్స్ లో స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా వరుసగా విడాకులు ఇచ్చుకుంటూ చిత్ర పరిశ్రమను షేక్ చేసేస్తున్నారు. గ‌త రెండేళ్ల క్రితం టాలీవుడ్ స్టార్ క‌పుల్స్‌గా పేరు తెచ్చుకున్న సమంత- నాగచైతన్య విడాకులు తీసుకోవడం ఇప్పటికి వారి అభిమానులకి మింగుడు పడటం లేదు.

వీరు విడాకులు తీసుకునీ రెండు సంవత్సరాల‌వుతున్నా మ‌ళ్లీ ఈ ఇద్దరు మళ్లీ కలవకపోతారా..? అంటూ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో సమంత- నాగచైతన్య కంటే ముందు మరో స్టార్ హీరోని ప్రేమించిందనే విషయం చాలామందికి తెలియదు. అంతేకాకుండా ఆ హీరోని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందన్న‌ది నిజం. సమంత పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ హీరో మరెవరో కాదు సిద్ధార్థ్.

సిద్ధార్థ్‌ టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లతో త‌న కెరీర్ లో ఎన్నో లవ్ ఎఫైర్లు నడిపాడో ఆయనకే తెలియదు. అలాంటి సిద్ధార్థ్ మాయలో సమంత కూడా పడిపోయింది. గతంలో కూడా వీరిద్దరూ కలిసి శ్రీకాళహస్తి గుడిలో పూజలు చేసిన ఫోటోలు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి.

ఇక తర్వాత వారి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ సమంతా, సిద్ధార్థ్‌ ఒకరికొకరు దూరంగా ఉంటూ వచ్చారు. తర్వాత సమంత, నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చూసుకోవడం వంటివి ఎంతో చకచగా జరిగిపోయాయి. ఇప్పుడు సమంత, నాగచైతన్యతో కూడా విడిపోవడంతో ఈ సారి ఎవ‌రిని పెళ్లి చేసుకుంటుందో ? చూడాలి. ఇక సిద్ధార్థ్ ప్ర‌స్తుతం మ‌రో హీరోయిన్ అదితిరావు హైద‌రీతో ప్రేమాయ‌ణం న‌డుపుతోన్న సంగ‌తి తెలిసిందే.