పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తన సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా తెరకెక్కిన 143 సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది సమీక్ష సింగ్. నక్సల్ బ్యాక్గ్రౌండ్తో తెరకెక్కిన ఈ సినిమాలో నాగబాబు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆశాసైని, బ్రహ్మాజీ వంటి వారు కీరోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా పూరి జగన్నాథ్ తీసుకున్నాడు.
ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు అప్పట్లో ఓ సెన్షేషన క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాలి అంటే 143 అనే టైటిల్ కాకుండా మరో టైటిల్ పెట్టి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా మరింత పెద్ద హిట్ అయ్యేదన్న చర్చ కూడా అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. ఈ సినిమా హీరోయిన్ సమీక్ష నటనకు మంచి మార్కులు దక్కాయి.
కానీ.. టాలీవుడ్ లో అవకాశాలు తలుపు తట్టలేదు. కేవలం టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటించిన సమీక్ష తమిళంలో మంచి పేరు సంపాదించుకుంది. తెలుగు, తమిళ్లోనే కాక హిందీ, కన్నడ, పంజాబీ భాషల్లోనూ ఈమె నటించింది. కొన్ని టీవీ షోల్లో కూడా ఈమె మెరిసింది. 2020లో గాయకుడు షేల్ ఓస్వాల్ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సమీక్ష వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఇప్పటికి కొనసాగుతుంది.
ఇటీవల ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన సమీక్ష.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటు తనకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేసుకుంటుంది. సమీక్ష ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు. పెళ్లికి ముందుకంటే సమీక్ష ఇప్పుడు ఏ మాత్రం గ్లామర్ తగ్గలేదు. అప్పటికంటే మరింత హాట్ గా కనిపిస్తూ తన ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది సమీక్ష.