సాధారణంగా చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో.. అలాగే ఒక హీరోయిన్ బదులు ఇంకొక హీరోయిన్ నటిస్తూ ఉంటారు. మరికొన్ని సార్లు దర్శకుడు అనుకున్న కథకు హీరో, హీరోయిన్లు దొరికిన, కొన్ని అనుకోని కారణాల వలన వారి స్థానంలో మరొకరిని పెట్టి సినిమా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా హీరోలు, హీరోయిన్లు మారిన ఆ సినిమాలు హిట్ అయితే వాటిలో నటించిన వారి దశ తిరిగినట్టే.
సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ కన్నా ముందు పూజా హెగ్డేను అనుకున్నారట. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల ఆ సినిమాకు నో చెప్పడంతో ఆ ఛాన్స్ మృణాల్ ఠాకూర్ కు వచ్చింది. ఈ సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదేవిధంగా ప్రస్తుత టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కూడా గతంలో ఓ బ్లాక్ బస్టర్ విజయాన్ని వదులుకుంది. ఆ సినిమా మరేదో కాదు ఛలో.
నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఛలో మూవీ ఎంతటి ఘనవిజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ మూవీతోనే కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాతోనే రష్మిక స్టార్ హీరోయిన్‌గా మారింది. అసలు విషయం ఏమిటంటే రష్మిక కన్నా ముందు ఛలో సినిమాకు శ్రీ లీలను హీరోయిన్‌గా అనుకున్నారట.
ఇదే విషయాన్ని నాగశౌర్య తాజా మూవీ రంగబలి సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. శ్రీలీల నో చెప్పడంతో ఆ ఛాన్స్ రష్మికకు దక్కింది. ఈ విధంగా శ్రీ లీల నో చెప్పిన సినిమాతో రష్మిక నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఒక వేళ ఛలో సినిమాలో శ్రీలీల హీరోయిన్గా చేసి ఉంటే ఖచ్చితంగా రష్మిక ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యేది కాదు.
ఆమె ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి చేసుకుని ఏ వైఫ్‌గానో ఇప్పటికే సెటిల్ అయిపోయి ఉండేది. ఎంచక్కా ఏ బెంగళూరులోనో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండేది.