ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించుకుని నిలదొక్కుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాంటిది ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్డంను సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తరువాత స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని.
సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టిన నాని అష్టాచెమ్మ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్డం సంపాదించుకున్న నాని తాజాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన దసరా సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇలా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడట. అష్టాచెమ్మ సినిమా అవకాశం దక్కించుకున్న నాని కి ఈ సినిమా ఆడియో లాంచ్ టైంలో ఘోరంగా అవమానం జరిగిందట. ఈ సినిమా ఆడియో లాంచ్ కి ఒక స్టార్ హీరోని గెస్ట్ గా పిలవగా ఆ స్టార్ హీరో నానిని చూసి వీడు హీరో ఏంటి? వీడిలో అసలు హీరో లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అంటూ నానిని అందరి ముందే ఘోరంగా అవమానించాడట.
అప్పుడు ఏ హీరో అయితే నానిని అవమానించాడో ? అదే స్టార్ హీరో చేత నేడు నాని ప్రశంసలు అందుకుంటున్నాడట. నాని తర్వాత కాలంలో ఈ విషయాన్ని తలచుకుని చాలా గర్వంగా ఫీలైన సందర్భాలు కూడా ఉన్నాయంటారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నానిని అవమానించిన స్టార్ హీరో ఎవరు? అనే దానిపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.