గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాలలో బింబిసారా కూడా ఒకటి. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ ముగిసినట్లే అనుకున్న సమయంలో బింబిసారా సినిమాతో కళ్యాణ్ రామ్ అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చాడు. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, కేథరిన్ థెస్రా హీరోయిన్లుగా నటించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో రెండు విభేన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్‌రామ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. అంతేకాకుండా ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా బింబిసార రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో ఈ సినిమాను కళ్యాణ్ రామ్ కంటే ముందే కొందరు హీరోల వద్దకు ఈ కథ వెళ్ళగా.. రిజెక్ట్ చేశారు.
ఈ సినిమాను వదులుకున్న అన్ లెక్కీ హీరోలు ఎవరో ? ఇప్పుడు చూద్దాం. ముందుగా దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమా కథను యంగ్ హీరో నితిన్ వద్దకు తీసుకువెళ్లాడట. కొత్త దర్శకుడితో ఇలాంటి సినిమా చేయటం మంచిది కాదని భావించి నితిన్ నో చెప్పాడట. ఆ తర్వాత మరో యంగ్ హీరో రామ్ వద్దకు వెళ్లగా ఆయన కూడా ఈ కథ తన ఇమేజ్‌కు సెట్ అవదని రిజెక్ట్ చేశాడట. అలాగే మాస్ మహారాజా రవితేజకు కూడా వశిష్ట ఈ కథను వినిపించాడు. కానీ ఏవో కారణాలతో రవితేజ కూడా ఈ సినిమాను వదులుకున్నాడు.
వీరే కాకుండా అల్లు శిరీష్, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశారనే టాక్ ఉంది. చివరగా కళ్యాణ్ రామ్‌కు కథ నచ్చడంతో సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకోవటం వంటివి చక చక జరిగాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత అనవసరంగా మంచి సినిమాను వదులుకున్నామే అని ఆ హీరోలు ఎంతగానో బాధపడ్డారట.