పవన్ కళ్యాణ్ – మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి చేస్తోన్న మల్టీస్టారర్ మూవీ బ్రో. ఈ సినిమా తమిళ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతం అనే తమిళ్ మూవీకి రీమేక్‌గా రానుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గట్టుగా రీమేక్‌లో కొన్ని సన్నివేశాలను ఆసక్తికరంగా మార్చి రాసాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. బ్రో సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి.. టీజర్ రిలీజ్ చేయకపోవడంతో సినిమా ప్రొడ్యూసర్ని ట్యాగ్ చేస్తూ టీజర్ రిలీజ్ చేయమంటూ గత కొద్ది రోజులుగా పవన్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కళ్ళు కాయలు కాచే వరకు ఎదురు చూసిన అభిమానులకు ఊరట నిస్తూ నిన్న బ్రో సినిమా టీజర్ విడుదల చేశారు. పవన్ ను అభిమానులు ఎలా ? చూడాలనుకుంటున్నారో అదే స్టైల్ లో ఈ సినిమాలో కనిపించ బోతున్నాడని టీజర్ చెప్పకనే చెప్పేసింది.
పవన్ స్టైల్, మేనరిజం, సాయి ధరంతే స్టైలిష్ యాక్షన్, పవన్ చిలిపి కామెడీ అన్ని బాగున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. టీజర్ తోనే సినిమా హిట్ అవుతుంది అనిపించేలా ఉంది టీజర్. “ కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం..” అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ అదరగొట్టేసాడు. ఈ సినిమా టీజర్ లో మీరు ఎవరు గమనించని మరో రెండు ఆసక్తికర విషయాలు
ఉన్నాయి.
టీజర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ తమ్ముడి గెటప్ లో కనిపించడం మనందరం గుర్తించాం. కానీ మధ్యలో ఈ షార్ట్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఈ షాట్లో జల్సా మూవీ స్టిల్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన బ్లాక్ హుడీలో స్టైల్ గా టీ గ్లాస్ పట్టుకొని నడిచి వచ్చే షాట్ పవన్ బంగారంలోని రా రా బంగారం.. సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ రేంజ్ కంటెంట్ తో నిండిపోయి ఉందట. అయితే నిన్న రిలీజ్ అయిన టీజర్ తోనే హిట్ కళ తెచ్చుకున్న బ్రో రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.