హీరో రాజా గౌతమ్ ఈ పేరు చెప్తే ఎవరు ? గుర్తుపట్టరు. కానీ బ్రహ్మానందం పెద్దకొడుకు.. పల్లకిలో పెళ్లికూతురు సినిమా హీరో అనగానే ఠక్కున గుర్తొస్తాడు. బ్రహ్మానందం సినీ బ్యాగ్రౌండ్‌తో 2004లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి పల్లకిలో పెళ్లికూతురు సినిమాలో హీరోగా నటించిన రాజా గౌతమ్ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలు అన్నీ సూపర్ హిట్?
ఇప్పటకీ పల్లకీలో పెళ్లికూతురు సాంగ్ ప్రతి పెళ్లిలోనూ వినిపిస్తూనే ఉంటోంది. ఈ సినిమా తర్వాత గౌతమ్ ఒకటి రెండు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. అయినా గౌతమ్ నటుడిగా తన ప్రయత్నాలను ఆపలేదు. ఇంతకీ రాజా గౌతమ్ కేవలం నటనని ఫ్యాషన్ గా మాత్రమే తీసుకున్నాడట. సినిమాల విషయం పక్కన పెడితే గౌతమ్ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్.
గౌతమ్‌కి చాలా వ్యాపారాలు ఉన్నాయట. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ చేసిన రాజా గౌతమ్ అనేక ఎమ్ఎన్‌సి కంపెనీలో ఇన్వెస్టర్ గా ఉన్నాడట. దీంతోపాటే బెంగళూరులో కొన్ని రెస్టారెంట్స్, అలానే కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయట. ఇలా రాజా గౌతమ్ పలు రకాల వ్యాపారాలు చేస్తూ నెలకు దాదాపు రు. 30 కోట్ల వరకు సంపాదిస్తున్నాడట. నెలకి 30 కోట్లు అంటే రోజుకు కోటి రూపాయల సంపాదనతో సూపర్ సక్సెస్ఫుల్గా గౌతమ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు.
గౌతమ్ సంపాదన స్టార్ హీరోస్‌ని కూడా మించిపోయింది. తండ్రి బ్రహ్మానందం నటుడిగా మూడు దశాబ్దాల పాటు నిరంతరాయంగా సినిమాల్లో కొనసాగుతూ కోట్ల సంపాదనని కూడపెట్టాడు. బ్రహ్మానందం డబ్బులు విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు. అలా బ్రహ్మానందం తన సినీ ప్రస్థానంలో సంపాదించిన కోట్ల ఆస్తి మొత్తం పెద్ద కొడుకు బిజినెస్‌ల వైపు మళ్ళించి ఆస్తులను మరింత పెంచుకుంటున్నాడట. బ్రహ్మానందం చిన్న కొడుకు విదేశాల్లో ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని సమాచారం. ఇటీవల అతడి నిశ్చితార్థం జరిగింది.