దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా బాహుబలి. ఈ సినిమాతో రాజమౌళి, ప్రభాస్‌కి పాన్ ఇండియా లెవెల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రభాస్ రాజమౌళికే కాకుండా ఈ సినిమాలో నటించిన భళ్లాలదేవ, శివగామి, దేవసేన , కట్టప్ప, అవంతిక పాత్రలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్‌కి పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ పెరిగింది.
సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర ఎంతలా వైరల్ అయ్యిందో చూశాం. ఈ సినిమాలో సత్యారాజ్ కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా ప్రేక్షకులు అందరిని మెప్పించాడు. ఈ సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ కు మొదట అనుకున్నది సత్యరాజ్‌ను కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్‌నట. ఈ రోల్‌కి సంజయ్ దత్ బాగా సెట్ అవుతాడని రాజమౌళి భావించాడట.
ఈ సినిమా కథను సంజయ్ దత్ కు కూడా వివరించాడట రాజమౌళి. కాని ఈ సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ కు బలం లేదని భావించిన సంజయ్ దత్ సినిమాని రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా సంజయ్ దత్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసినందుకు చాలా బాధపడుతున్నానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఒకవేళ నిజంగా సంజయ్ దత్ కట్టప్ప పాత్ర పోషించి ఉంటే అతడి కెరీర్‌లోనే మర్చిపోలేని పాత్రల్లో చిరస్థాయిగా మిగిలిపోయి ఉండేది. ఏది ఏమైనా సంజయ్ క్యారెక్టర్ లో నటించి ఉంటే ఎంత గుర్తింపు వచ్చేదో తెలియదు కానీ.. సత్యరాజ్ మాత్రం ఈ క్యారెక్టర్ లో జీవించేసాడు. ప్రేక్షకుల్లో కట్టప్ప పాత్ర అలా మదిలో నిలిచిపోయింది.