ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఏ హీరోకు లేని గొప్ప రికార్డ్ ఉపేంద్ర‌కే సొంతం… గ్రేట్‌..!

శాండిల్ ఉడ్‌కు చెందిన ద‌ర్శ‌కుడు, న‌టుడు.. ఉపేంద్ర మ‌న‌కు తెలుగులోనూ ప‌రిచ‌య‌మే. అనేక సిని మాల‌ను ఆయ‌న కూడా చేశారు. తెలుగులో కూడా.. ఆయ‌న కొన్ని హిట్‌లు కొట్టారు. అయితే.. క‌న్న‌డ‌లో ఆయ‌న అగ్ర‌ద‌ర్శ‌కుడు. ఆయ‌న తీసే సినిమాల‌కు మంచి క్రేజ్ ఉంది. నిజానికి మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌ట్టుగానే.. శాండిల్ ఉడ్‌లోనూ అనేక మంది ద‌ర్శ‌కులు ఉన్నారు. అయితే.. ద‌క్షిణాదిలోనే కాదు.. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ సాధించ‌ని రికార్డు సాధించారు.

అదే.. `ఓం` అనే క‌న్న‌డ సినిమా! ఈ సినిమాను ఉపేంద్ర దర్శకత్వంలో శివరాజ్‌కుమార్ కథానాయకు డిగా తీశారు. ప్రేమ ఇందులో హీరోయిన్ గా న‌టించింది. 1995 మే 19న విడుదలైన ఈ చిత్రం కన్నడలో సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి మార్చి 12, 2015 వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్‌ చేశారు. అత్యధికసార్లు రీ రిలీజ్‌ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

సాధార‌ణంగా ఏదైనా సినిమాను ఎన్నిసార్లు రీ-రిలీజ్‌ చేస్తారంటే.. ఒక‌టి లేదా.. రెండు మ‌హా అయితే.. 5 సార్లు. కానీ, ఓం సినిమాను ఏకంగా 550 సార్లు రీరిలీజ్‌ చేశారు. దర్శకుడు ఉపేంద్ర కాలేజీలో చదువుకునే రోజుల్లో రాసుకున్న క‌థ ఆధారంగానే ఈ సినిమాను షూట్ చేశారు. సెకండ్ హాఫ్ మూవీ మ‌రింత హైలెట్ అయింది. ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌, మాఫియా బ్యాక్‌డ్రాప్‌ నుంచి నిజ జీవిత సంఘటనల ఆధారంగా సెకండ్ హాఫ్ ర‌క్తి క‌ట్టించింది.

సినిమా విడుదలకు ముందే కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ‘ది వీక్‌’ మ్యాగజైన్‌ ‘ఓం’పై ఏకంగా కవర్‌ స్టోరీనే ప్రచురించింది. తొలుత తీసిన ‘ఓం’ మూవీ క్లైమాక్స్‌ వెర్షన్‌పై సెన్సార్‌బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్పులు చేస్తేనే ధ్రువీకరణ పత్రం ఇస్తామని చెప్పడంతో అందుకు అనుగుణంగా మార్పులు చేశారు. ఈ సినిమాకు రూ.70 లక్షలు మాత్ర‌మే ఖ‌ర్చు చేయ‌డం గ‌మ‌నార్హం. కానీ, ఈ సినిమా మొత్తంగా 25 కోట్లు రాబ‌ట్టింది.