క్రికెట‌ర్ అజారుద్దీన్ రెండో భార్య సంగీత – స‌ల్మాన్‌ఖాన్‌ పెళ్లి చేసుకున్నారా… ఎవ్వ‌రికి తెలియ‌ని సీక్రెట్‌..!

బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ ఐదున్నర పదుల వయసు వస్తున్నా ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా మిగిలిపోయాడు. సల్మాన్ తన కెరీర్లో ఎంతోమంది అమ్మాయిలు, హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపాడు. అయితే అవన్నీ ఫెయిల్ అయ్యాయి. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ , సోమీ అలీ, సంగీత బిజ్లాని ఇలా చెప్పుకుంటూ పోతే సల్మాన్ కెరియర్ లో ఎంతోమంది అమ్మాయిలు వచ్చి చేరారు.

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండిజ్‌తోను సల్మాన్ చాలాకాలం సహజీవనం చేశాడు అంటారు. ఆ తర్వాత రొమేనియా గాయని లులియా వాంటూర్ ను కూడా సల్మాన్ ప్రేమించాడని.. ఆమెని పెళ్లి చేసుకుంటాడని కథనాలకు వచ్చాయి. అయితే సల్మాన్ జీవితంలో ఇప్పటివరకు కూడా పెళ్లి జరగలేదు.
అయితే ఒకప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఉన్న సంగీతా బిజ్లాని తో ప్రేమాయణం అతడి జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి.

స‌ల్మాన్, హీరోయిన్ సంగీత కలిసి కొన్ని సినిమాలలో నటించారు. 1990వ దశకం ప్రారంభంలో ఇద్దరం ప్రేమలో ఉన్నామని సల్మాన్ చెప్పాడు. అయితే ఈ జంట పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.
పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయ్యాయట. పెళ్లి తేదీలు కూడా ఖరారు అయ్యాయి. ఇక ఇద్దరి పెళ్లి జరగడమే తరువాయి అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా పెళ్లి రద్దయింది. సల్మాన్, సంగీత జంట 27 మే, 1994న పెళ్లి చేసుకోవాలని కార్డులు కూడా ప్రింట్ వేయించారంట.

అయితే ఈ విషయం అప్పట్లో చాలామందికి తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత కరణ్ జోహార్ షోలో పాల్గొన్న సల్మాన్ తాను సంగీతను పెళ్లి చేసేందుకు రెడీ అయ్యామ‌ని .. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయ్యాయని ఒప్పుకున్నాడు. అయితే ఈ పెళ్లి ఎందుకు ? క్యాన్సిల్ అయిందని మాత్రం సల్మాన్ చెప్పలేదు. అయితే సల్మాన్ మరో అమ్మాయితో రూమ్ లో ఉండగా సంగీత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని.. ఆ కారణంతోనే సల్మాన్‌తో పెళ్లి రద్దు చేసుకుందని అప్పట్లో పుకార్లు వచ్చాయి.

సల్మాన్ కు దూరమయ్యాక సంగీత భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌తో ప్రేమలో పడింది. అప్పటికే అజారుద్దీన్‌కు నౌరీన్‌తో పెళ్లయి ఇద్దరి మగ పిల్లలు కూడా ఉన్నారు. కేవలం సంగీతను పెళ్లి చేసుకునేందుకే అజార్ నౌరీన్‌కు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత సంగీత, అజార్ పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి దాంపత్య జీవితం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. వీరిద్దరూ కూడా మనస్ప‌ర్థ‌ల నేపథ్యంలో తర్వాత విడాకులు తీసేసుకున్నారు. అలా సల్మాన్ ఖాన్ భార్య కావాల్సిన సంగీత తృటిలో ఆ అదృష్టాన్ని కోల్పోయింది.