ముద్దొస్తున్న ఈ బుడ్డోడు మెగా ఫ్యామిలీ హీరో… ఎవ‌రో గుర్తు ప‌ట్టారా…!

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్‌ల‌ చిన్నప్పటి ఫోటోలు త్రో బ్యాక్ థీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే పైన బొద్దుగా చూడ్డానికి ముద్దొచ్చేలా ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..? మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో టాలీవుడ్‌లో చిన్న సినిమాల్లో నటిస్తూనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో అతడి సినిమాలను విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకుంటూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్ర‌స్తుతం ఈ హీరో ప్రస్తుతం ఒక థ్రిల్లర్ సినిమాల్లో నటిస్తు బిజీగా ఉన్నాడు.

ఇటీవల ఒక స్టార్ హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పుడైనా ఆ స్టార్ హీరో ఎవ‌రో ? గుర్తుపట్టారా.. అతనే మెగా హీరో వరుణ్ తేజ్.. చిరంజీవి తమ్ముడు నాగబాబు కొడుకు. మెగా బ్యాగ్రౌండ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2014లో ముకుంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా.. త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కంచె, లోఫర్, మిస్టర్ సినిమాల్లో నటించాడు. మిస్టర్ సినిమా షూటింగ్ టైంలో లావణ్య త్రిపాఠితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇటీవలే ఇరుకుటుంబాల సమక్షంలో వీరిద్ద‌రు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మిస్టర్ సినిమా తర్వాత వరుణ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఫిదా సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్‌ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్.

ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించిన వరుణ్ చివరిగా ఎఫ్ 3 సినిమాలో నటించాడు. ప్రస్తుతం గాండీవ ధారి అర్జున‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఏజెంట్ భామ‌ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. ఆగ‌స్టు 25న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి వరుణ్ ఫస్ట్ లుక్ రిలీజై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.