రాశీ స్టార్ హీరోయిన్ కావ‌డానికి.. చిరంజీవి భార్య సురేఖే కార‌ణ‌మా… !

సీనియర్ హీరోయిన్ రాశి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. చెన్నైలో పుట్టిన రాశి మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. కొంతకాలం తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమై మంచి క్రేజ్ సంపాదించుకుంది. అప్ప‌ట్లో అగ్ర హీరోల అందరి సరసన నటించి సూపర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. హీరోయిన్‌గానే కాక ఎన్నో స్పెషల్ సాంగ్స్ లో కూడా రాశి మెరిసింది.

కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ శ్రీనివాస్‌ను వివాహం చేసుకున్న రాశి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. అంత‌కుముందే రాశికి మ‌న‌సిచ్చిచూడు సినిమా డైరెక్ట‌ర్ సురేష్‌వ‌ర్మ‌తో వివాహం జ‌రిగినా మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో విడిపోయారు. శ్రీనివాస్‌ను వివాహం చేసుకున్నాక కొంత కాలం గ్యాప్ వ‌చ్చినా త‌ర్వాత‌ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రాశి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ షోస్ లో స్పెషల్ గెస్ట్ గా మెరుస్తోంది.

దీంతోపాటే బుల్లితెరపై వచ్చే కొన్ని ప్రముఖ సీరియల్స్ లో రాశి నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ‌.. రాశి మధ్య ఒక సంబంధం ఉందట. ఇంతకీ ఏంటా ? సంబంధం అనుకుంటున్నారా.. వీరిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. కాని రాశి స్టార్‌ హీరోయిన్ కావడానికి చిరంజీవి భార్య సురేఖనే కారణమట. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న గోకులంలో సీత సినిమాకు హీరోయిన్ గా రాశి బాగుంటుందని డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్యకు సురేఖనే స్వ‌యంగా సజెస్ట్ చేసిందట.

చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాను రీమేక్ చేస్తున్న సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో రాశి నటించింది. అప్పటి నుంచి చిరంజీవి ఫ్యామిలీతో రాశికి మంచి బాండింగ్ ఏర్పడింది. రాశి ఫ్యామిలీ చెన్నైలో ఉండే టైం లో ఒకసారి చిరంజీవి – సురేఖ అనుకోకుండా రాశి తండ్రిని కలిశారట. అప్పుడు రాశి ఫోటోలు చూసిన చిరంజీవి – సురేఖ ఎంతో అందంగా ఉందని తెగ‌ మురిసిపోయారట.

సురేఖ చిరంజీవితో.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో రాశిని హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని చెప్పడంతో రాశీని హీరోయిన్‌గా తీసుకున్నారు. అలా పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత సినిమాలో హీరోయిన్గా రాశీ న‌టించి సూపర్ హిట్ త‌న‌ ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత ఆమె తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా కొంత కాలం ఓ వెలుగు వెలిగింది.