టాలీవుడ్ ఒకప్పటి సీనియర్ హీరోయిన్ సంగీత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చెన్నైలో జన్మించిన ఈ భామ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మలయాళ సూపర్ హిట్ సినిమా గంగోత్రి మూవీ ద్వారా తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో ఖడ్గం సినిమాతో సంగీత కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా సంగీత నటించింది. ఈ సినిమాకు ముందు పలు తెలుగు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు ఏమీ రాలేదు. కానీ ఖడ్గం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటిస్తూ హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
ఇక ప్రస్తుతం సంగీత తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా కొనసాగుతుంది.
రీసెంట్ గానే మసూద, వారసుడు వంటి సినిమాల్లో కీలకపాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించింది. సంగీత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈమె 2009లో క్రిష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం..సంగీత – క్రిష్ వివాహం తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరార్ ఆలయంలో జరిగింది.
సంగీత భర్త క్రిష్ కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వాడనే విషయం చాలామందికి తెలియదు. ఈయన ఒక సింగర్ నటుడు, ముఖ్యంగా కోలీవుడ్ లో ఎక్కువగా పని చేసేవాడు. కోలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాలుకు క్రిష్ పాటలు పాడడు. అలాగే కొన్ని కోలీవుడ్ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.
అయితే క్రిష్ నటుడుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా కానీ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక క్రిష్- సంగీత దంపతులకు 2012లో ఓ పాప కూడా జన్మించింది. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉన్నారు. సంగీత తెలుగు బుల్లితెరపై కూడా పలు షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.