‘ సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న ‘ ఒక్క‌సారి కాదు రెండు సార్లు చూడాల్సిందే… అబ్బ ఎన్ని హైలెట్సో…!

శ్రీవిష్ణు చాలా టాలెంట్ ఉన్న నటుడు.. ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి డౌట్లు లేవు. సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.. స‌రైన ట్రాక్ రికార్డ్ లేక‌పోయినా కూడా అత‌డికి వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయంటే అత‌డిలోని కామోడీ టైమింగ్ కార‌ణం. ఈ క్ర‌మంలోనే ఈ రోజు అత‌డు న‌టించిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సినిమా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాకు మూడు రోజుల ముందే ప్రీమియ‌ర్ షోలు ప‌డ్డాయి. సినిమాకు పాజిటివ్ వైబ్స్ వ‌చ్చేశాయి. క‌థ‌గా చూసుకుంటేనే ఈ సినిమా చాలా బాగుంటుంది. సినిమా ఆద్యంతం కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. సినిమాలో కామెడీకి, హైలెట్స్‌కు అస్స‌లు కొద‌వేలేదు. క‌థ‌గా చూసుకుంటే తండ్రిని 20 ఏళ్లుగా డిగ్రీ పాస్ చేయించేందుకు కొడుకు ప‌డే క‌ష్టాలు… హీరో త‌న‌కు ఐల‌వ్ యు చెప్పిన ప్ర‌తి అమ్మాయికి బ‌ల‌వంతంగా రాఖీ క‌ట్టేయ‌డం కొత్త‌గా ఉంటాయి.

చివ‌ర‌కు హీరోయిన్ హీరో ఇంటికే ఫేయింగ్ గెస్ట్‌గా రావ‌డం.. వాళ్లిద్ద‌రు ల‌వ్‌లో ప‌డడం.. వారి ప్రేమ పెళ్లికి పెద్ద‌ల‌ను ఒప్పించాల‌నుకుంటోన్న టైంలో హీరో బావ‌కు, హీరోయిన్ అక్క‌కు పెళ్లి కుద‌ర‌డం చాలా కొత్త‌గా అనిపిస్తాయి. ఆ త‌ర్వాత హీరోయిన్ వాళ్లు హీరోయిన్‌తో హీరోకు రాఖీ క‌ట్టించే ప్ర‌య‌త్నాలు ఇలా కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది.

కులశేఖర్ పేరుతో సెకండాఫులో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర కూడా భ‌లే స‌ర‌దాగా ఉంటుంది. నరేష్, శ్రీవిష్ణు నటన, ఫ‌స్టాఫ్‌, డైలాగులు, ఇంటర్వల్ ట్విస్ట్ కోసం రెండోసారి సినిమాకు వెళ్లాల‌న్న‌ట్టుగా ఉన్నాయి. ఒక్క క్లైమాక్స్ ఇంకా బాగా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇక ఒక్క పాట కూడా క్యాచీగా లేదు. అయినా ఇలాంటి కామెడీ సినిమాకు పాట‌లు క‌థ‌నంలో అడ్డుప‌డ్డాయే త‌ప్పా ఫ్ల‌స్ అవ్వ‌లేదు.

ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. సినిమా అంతా 2 గంటల 20 నిమిషాల్లో సినిమా ముగిసింది. కెమెరా వర్క్, ఇత‌ర టెక్నిక‌ల్ విభాగాలు బాగా కుదిరాయి. ఇక మధ్యతరగతి యువకుడిగా శ్రీవిష్ణు మెప్పించాడు. ర‌ఘుబాబు ట్రాక్ నవ్విస్తే, వెన్నెల కిషోర్ ట్రాక్ ఇంకా నవ్వించొచ్చు. ఇక తెలుగులో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ పెద్ద‌గా రావ‌డం లేదు. ఇది ఖ‌చ్చితంగా కుటుంబం అంతా క‌లిసి చూసి చ‌క్క‌గా ఎంజాయ్ చేసే సినిమా.