బాబాలుగా మారిన టాలీవుడ్‌ స్టార్ హీరోలు వీళ్లే… ఎవ‌రో గుర్తు ప‌ట్టారా…!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక రోజుకు అప్డేట్ వ‌చ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రీసెంట్ గానే శ్రీరాముడు- సీత ఎలా ఉంటారో ? వాల్మీకి రామాయణం చెప్పిన విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారిని క్రియేట్ చేసింది. ఆ ఫోటోలు చూసిన వారందరూ కూడా నిజమైన రాముడు- సీత ఇలానే ఉంటారా ? అనే విధంగా అందర్నీ ఆశ్చర్యపరిచింది.

తాజా మన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని రాజుగా, బిజినెస్ మేన్ గా, వివిధ రకాల వృత్తుల్లో ఎలా ? ఉంటారో ఆ ఫోటోలను రూపొందించి ఏఐ సోషల్ మీడియాలో వదిలింది. అంతేకాకుండా ఆదిపురుష్ సినిమాలో నటించిన ప్రభాస్, కృతి సనన్‌, సైఫ్ అలీ ఖాన్ ను రాముడు, సీత‌, రావణుడు పాత్రలో ఎలా ? ఉంటారో చూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ద్వారా వచ్చిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా స్టార్ హీరోలు బాబాలుగా, స్వామీజీల వేషాల్లో ఎలా ? ఉంటారో ఏఐ చూపించింది. అలా ఏఐ క్రియేట్ చేసిన స్వామీజీలలో టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్,, మహేష్ బాబు, అంతేకాకుండా కోలీవుడ్ నుంచి కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ధనుష్, సూర్య కూడా ఉన్నారు.

ఇక వీరందరూ ఆ ఫోటోలలో అచ్చం సన్యాసులు, బాబాల మాదిరిగానే ఉండటం విశేషం. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌ గా మారాయి. ఈ ఫొటోల‌పై మీరు కూడా ఓ లుక్కేస్తే వారు నిజ‌మైన బాబుల‌గానే ద‌ర్శ‌న‌మిస్తూ ఉంటారు.

 

View this post on Instagram

 

A post shared by Psycadelic Art (@wild.trance)