మరో కొత్త బాయ్ ఫ్రెండ్‌ను పట్టేసిన సమంత… ఎక్క‌డ చూసినా ఈ జంట ర‌చ్చే…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. అంతే కాకుండా బాలీవుడ్లో నటిస్తున్న సీటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ షూటింగ్‌కు బ్రేక్ రావడంతో సమంత వెకేషన్ మూడ్‌లోకి వెళ్ళింది. మధ్య మధ్యలో పలు షూటింగ్స్ లో పాల్గొంటున్నా వెకేషన్‌ను మాత్రం ఎంతో ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంత ఏది షేర్ చేసిన ఒకసారిగా వైరల్ గా మారుతుంది.

తాజాగా సమంత సోషల్ మీడియాలో వర్కౌట్ చేస్తున్న ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో సమంత పక్కన ఉన్న‌ఒక వ్యక్తి గురించి అభిమానులంతా చర్చించుకుంటున్నారు. గ‌త కొద్ది రోజులుగా సమంత ఎక్కడ ఉంటే అతడు కూడా అక్కడే ఉంటున్నాడు. అతని పేరు ఏంటి ? అత‌డు ఫ్రెండా ? బాయ్ ఫ్రెండ్ అనే విషయం ఎవరికీ అర్థంకావటం లేదు.

అంతేకాకుండా సమంత పుట్టినరోజున‌ కూడా అతనే సర్ప్రైజ్ ప్లాన్ చేసి మరి సమంతతో కేక్ కట్ చేయించాడు. అంతేకాకుండా ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలు సమంతతో వర్కౌట్ జిమ్ లో కనిపించాడు. సమంత స్నేహితుల లిస్టులో ఉన్న వారందరిలో ఇతడే ఎక్కువగా చనువుగా కనిపిస్తుండడంతో ఇత‌డు ఎవరు ? అనే అనుమానం అందరిలో వ్యక్తమవుతోంది.

తాజాగా సామ్ వెకేషన్ ఫొటోస్ లో కూడా అతను కనిపించాడు. అయితే ఏ రోజు కూడా సామ్ అతడి గురించి మెన్షన్ చేయలేదు. ఎవరు అనేది కూడా చెప్పలేదు. దీంతో అభిమానుల్లో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరు బ్రో .. నువ్వు.. నిత్యం సామ్ చుట్టూనే తిరుగుతున్నావు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి సామ్ అయినా.. ఇతగాడిని పరిచయం చేస్తుందేమో చూడాలి.