చిరు పెద్ద కూతురు సుస్మిత – ఉద‌య్ కిర‌ణ్ గురించి షాకింగ్ విష‌యాలు బ‌య‌టకొచ్చాయ్‌… పెళ్లి అందుకే క్యాన్సిల్‌..!

మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్నారు. 67 సంవత్సరాల వయసులోనూ చిరంజీవి కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. చిరంజీవి సినిమా జీవితాన్ని అస్సలు వేలు ఎత్తి చూపించలేము. అయితే ఫ్యామిలీ పరంగా ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిరు ఇద్దరు కుమార్తెల వైవాహిక జీవితాలు ఏ మాత్రం సవ్యంగా సాగటం లేదు.

పెద్ద కుమార్తె సుస్మిత‌కు ముందుగా దివంగత హీరో ఉదయ్ కిర‌ణ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత చెన్నైకి చెందిన అబ్బాయితో సుస్మితకు పెళ్లి చేశారు. సుస్మిత ఇప్పుడు ఇంకా చెప్పాలంటే గత పదేళ్లుగా తండ్రి వద్ద హైదరాబాదులో ఉంటుంది. ఇక రెండో కుమార్తె శ్రీజ ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుంది.

మొదటి భర్త శిరీష్ కు విడాకులు ఇచ్చేసి తండ్రి దగ్గరే చాలా ఏళ్ల పాటు ఉంది. ఆ తర్వాత చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవితో శ్రీజకు రెండో వివాహం జరిపించారు ఓ పాప జన్మించాక శ్రీజ మళ్లీ భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇక ఉద‌య్ కిర‌ణ్‌తో చిరు కుమార్తె సుస్మిత ఎంగేజ్మెంట్ జ‌ర‌గ‌డం అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. చిరంజీవి ఓ కుర్ర హీరోను అల్లుడిగా చేసుకోబోతున్నారంటూ ఇండ‌స్ట్రీ హ్యాఫీ ఫీల్ అయ్యింది.

ఇంత‌లోనే పెళ్లి క్యాన్సిల్‌. దీని వెన‌క ఏం జ‌రిగింది ? అన్న‌ది కొంత తెలిసినా చాలా విష‌యాలు బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా ఓ సినీ జ‌ర్న‌లిస్టు చెప్పిన దాని ప్ర‌కారం చిరు ఇంద్ర సినిమా శ‌త‌దినోత్స‌వ వేడుకుల‌కు హాజ‌రైన‌ప్పుడే చాలా మంది వీరిద్ద‌రి పెళ్లి జ‌రుగుతుంద‌ని భావించార‌ట‌. చిరు కూతురుతో పెళ్లి కుదిరిన వెంట‌నే ఉద‌య్ కిర‌ణ్ జ‌ర్న‌లిస్టు మిత్రుల‌కు పార్టీ కూడా ఇచ్చాడ‌ట‌.

ఇంత‌లో ఏం జ‌రిగిందో కాని.. మ‌హిళా జ‌ర్న‌లిస్టుతో ప్రేమాయ‌ణం వ‌ల్లే ఉద‌య్ కిర‌ణ్ – సుస్మిత పెళ్లి ఆగిపోయింద‌న్న రూమ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ట‌. ఆ త‌ర్వాత మెగా ఫ్యామిలీయే ఉద‌య్‌ను తొక్కేసింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. దీనికి తోడు ఉద‌య్ కిర‌న్ న‌టించిన సినిమాలు అన్నీ వ‌రుస‌గా ప్లాప్ అవుతూ వ‌చ్చాయి. జీవితంలో స‌క్సెస్ ఎంజాయ్ చేసిన ఉద‌య్‌.. ఫెయిల్యూర్స్ త‌ట్టుకోలేక చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.