పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మూవీ బ్రో. కోలీవుడ్‌లో వచ్చిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెలుగులో వస్తుంది. ఈ సినిమాకు విలక్షణ నటుడు, సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పోర్షన్ షూటింగ్ మొత్తం ఇప్పటికే కంప్లీట్ అయిందట. పవన్ ఈ సినిమాలో దేవుడిగా కనిపించబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మోషన్ పోస్టర్లు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి ముఖ్యంగా పవన్, సాయి ధరమ్ తేజ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాను వచ్చేనెల 28న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యూనిట్ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు.
తాజాగా బ్రో మూవీ టీజర్ అప్డేట్ను త్వరలోనే ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఆ పోస్టర్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. ఈ పోస్టర్లో పవన్‌తో పాటు మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఉన్నాడు ఇద్దరూ అదిరిపోయే మాస్ లుక్ లో కనిపించారు.
ఆ పోస్టర్లో పవన్ తమ్ముడు సినిమాలో వయ్యారిభామ సాంగ్‌లో కనిపించినట్టు రైల్వే కూలీ గెటప్ లో కనిపించగా..మెగా మేనల్లుడు కూడా లుంగీకట్టి మెడలో ఎర్ర కండువా వేసుకుని చేతిలో బీడీ పట్టుకుని మాస్ లుక్‌లో కనిపించాడు. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Soon… #bro teaser 🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/C92GT8HAzE
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 27, 2023