టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమ వ్యవహారం నిజమే అని ఈ బ్యూటీ ఎప్పుడు ఒప్పుకుందో ఒక్కసారిగా అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది. విజయ్ వర్మ విషయంలో తన నిర్ణయాన్ని కొందరు తప్పుపడుతుంటే, మరికొందరు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. దీంతో తమన్నా ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఈమె చుట్టూనే ఉంటున్నారు.
తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఓ అభిమానితో తమన్నా ఎంతో క్లోజ్ గా మూవ్ అవ్వగా… ఆ అభిమాని ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. తమన్నాను కలిసి ఆ వ్యక్తి ఆమె పాదాలకు దండం పెట్టి ఆ తర్వాత బొకేతో పాటు ఒక లెటర్ ని కూడా మిల్కీ బ్యూటీకి అందించాడు. అంతేకాకుండా తన చేతిపై ఉన్నపచ్చబొట్టును కూడా తమన్నాకు చూపించడంతో ఒకసారి కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక ఆ పచ్చ బొట్టులో లవ్ యు ది తమన్నా అనే పదంతో పాటు.. తమన్నా ఫోటోను చేతిపై అభిమానంతో వేయించుకున్నాడు. ఆ తర్వాత ఆ అభిమానిని తమన్నా కౌగిలించుకొని అతడికి నమస్కారం చేస్తూ ఎన్నో ధన్యవాదాలు చెబుతూ తన కారులోకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమన్నా తన అభిమానుల పట్ల చూపించే ప్రేమ ఎలా ? ఉంటుందో ఈ వీడియో చూస్తే సరిపోతుంది అంటూ ఆ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాకుండా తమన్నాని ఆకాశానికి ఎత్తేస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తమన్నాకు ఇంత గొప్ప అభిమానులు ఉన్నారా ? అని ఆమెను ప్రశంసిస్తున్నారు. దీంతో తమన్నా పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.
View this post on Instagram