నాగార్జున – అమల రెండో బిడ్డను ఎందుకు క‌న‌లేదు… ఏఎన్నార్ వెరీ హ్యాపీయా…!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది జంటలో ఉన్న అక్కినేని నాగార్జున- అమల జంటకు ఎంతో ప్రత్యేకత ఉంది. టాలీవుడ్‌లో ఎన్ని కొత్త జంటలు వచ్చినా నాగార్జున- అమలకు ఉన్న ఫాలోయింగ్ వేరు. నాగార్జున – అమలను రెండో పెళ్లి చేసుకున్న ఈ జంట చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటారు. ఎంతో అన్యోన్యంగా చక్కగా ఉంటారంటూ ఈ జంటపై కామెంట్లు కూడా చేస్తారు.

అయితే అక్కినేని నాగార్జునకి మొదటి నుంచి తన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలని ఆశపడేవారట. ఇక ఆ సమయంలోనే అమల గర్భవతి అని తెలిసిన సమయంలో ఆడపిల్ల పుడుతుందని ఎంతో ఆశ పడ్డారట. చివరకు అఖిల్ పుట్టడంతో మరో బిడ్డని ప్లాన్ చేసుకోవాలని భావించారట. నాగార్జున రెండో బిడ్డ‌కు ప్లాన్ చేద్దాం అని అమ‌ల‌కు చెప్పార‌ట‌.

అయితే నాగార్జున ఆ మాట అన్న వెంట‌నే అమల నాకు ఒక బిడ్డ అని ఎవరు ? చెప్పారు.. ఇద్దరు బిడ్డలు ఉన్నారు అంటూ నాగచైతన్య కూడా నా కొడుకే క‌దా ? నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు మరో బిడ్డ ఎందుకు ? అని చెప్పింద‌ట‌. అస‌లు నాగార్జున – అమ‌ల పెళ్లి ఇష్టం లేని ఏఎన్నార్‌కు… అప్పటివరకు అమ‌ల‌ అంటే ఎంతో కోపంగా ఉండేద‌ట‌.

ఆ టైంలో అమ‌ల చెప్పిన ఆ మాట‌ల‌కు స్ట‌న్ అయ్యి… తన పెద్ద మనుమడు నాగచైతన్య పై ఆమె చూపిస్తున్న ప్రేమకు ఎంతో ఆనందపడిపోయి అమలని అక్కినేని కోడలిగా మ‌న‌స్ఫూర్తిగా ఒప్పుకున్నారట. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో అమల ఆయనకు ఎన్నో సేవలు కూడా చేసిందట. మామగారి ఆహార విషయంలో ఎన్నో కంట్రోల్ చేస్తూ జాగ్రత్తగా చూసుకుందని అంటూ ఉంటారు.