ఏ సినిమాలో అయినా సరైన విలన్ ఉంటేనే ఆ సినిమాకైనా, హీరోకైనా మంచి ఇమేజ్ వస్తుంది. సినిమాలో హీరో క్యారెక్టర్‌కి తగ్గట్టుగా విలన్ లేకపోతే.. పప్పులో ఉప్పు లేనట్టే. విలన్ ఎంత క్రూరంగా ఉంటే హీరో ఆ పాత్ర అంత హైలెట్ అవుతుంది. క్రూరంగా చంపడం, పగ, ద్వేషం బాగా హింసంచడం ఇలాంటివి మన తెలుగు స్టార్ విలన్లు ఎంత బాగా చేస్తారో అందరికీ తెలుసు. అయితే ఇంత క్రూరంగా ఉండే ఈ విలన్ల భార్యలు ఎంత అందంగా ఉంటారో ? చాలామందికి తెలియదు. వారి అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు. అయితే ఈ విలన్ల భార్యలు ఎవరో ఒకసారి చూద్దాం.
రఘువరన్ – రోహిణి :
చిత్ర పరిశ్రమలో దివంగత నటుడు రఘువరన్ కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసినా విలన్ గానే మంచి గుర్తింపు వచ్చింది. 1982 కోలీవుడ్ ఎంట్రి ఇచ్చిన రఘువరన్ ఆ తర్వాత తెలుగు మలయాళం, అన్ని పరిశ్రమలో సినిమాలు చేసి ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. ఇక ఈయన భార్య విషయానికొస్తే, ఆమె ఎవరో కాదు ప్రముఖ రైటర్ గా , దర్శకురాలిగా, లిరిసిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన రోహిణి. దాదాపు 70 చిత్రాలకుపైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అవినాష్ – మాళవిక :
అప్పట్లో విలన్ గా అదరగొట్టి, ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నాడు. కన్నడ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియార్ నటుడు అవినాష్, తెలుగు చిత్రాలలో కూడా నటించాడు. కేవలం 20 సంవత్సరాలలో దాదాపు 16 వందల సినిమాలకు పైగా నటించి, రికార్డు సృష్టించిన నటుడు. ఇక ఈయన భార్య మాళవిక. ఈమె కన్నడ టాప్ హీరోయిన్. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ ప్రస్తుతం బుల్లితెరపై సెటిల్ అయింది.
మురళీ శర్మ – అశ్విని :
విలన్ గా మంచి పేరు పొందిన మురళీశర్మ. మురళీశర్మ తెలుగుతో పాటు తమిళంలో అటు బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా కొనసాగుతున్నారు. ఈయన భార్య అశ్విని కూడా బుల్లితెరపై టాప్ హీరోయిన్. ప్రస్తుతం మురళీశర్మ టాలీవుడ్లోనే బిజీ నటుడిగా కొనసాగుతున్నాడు.
అతుల్ కులకర్ణి :
ఈయన పేరుకు తగ్గట్టుగా ఎంతో క్రూరమైన విలన్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. తెలుగులో చంటిగాడు, లీలామహల్ సెంటర్, రామ్ వంటి పలు సినిమాల్లో విలన్ గా చేసిన కులకర్ణి. ఇక ఈయన భార్య కూడా ఎంతో అందంగా ఉంటుంది.ఈమె కూడా గొప్ప నటి అనే విషయం చాలామందికి తెలియదు. ఈయన భార్య గీతాంజలి కూడా అన్ని ఇండస్ట్రీలో నటించింది.
బీజూ మీనన్:
ఈ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే సినిమా రణం. గోపీచంద్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో విలన్ గా బీజూ మీనన్ టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆక ఈయన కోలీవుడ్ టాలీవుడ్ సినిమాలతో పాటు మలయాళం లో కూడా 100కు పైగా సినిమాల్లో నటించారు. ఈయన భార్య కూడా ఓ స్టార్ హీరోయిన్.
బీజూ మీనన్ భార్య సంయుక్త వర్మ ఒకప్పటి ఫేమస్ మలయాళ హీరోయిన్. 1999లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక బీజూ మీనన్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇలా ఈ విలన్స్ మత్రమే కాకుండా చాలామంది విలన్స్ భార్యలు స్టార్ హీరోయిన్లను మించిన క్రేజ్‌తో దూసుకుపోతున్నారు.