విజయశాంతి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో… పాన్ ఇండియాలో తిరుగేలేదు..!

గతంలో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న ఒకప్పటి సీనియర్ హీరోయిన్ విజ‌య‌శాంతి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ పాత్రలు చేస్తూనే, ఒసేయ్ రాములమ్మ, భారతరత్న, కర్తవ్యం వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సూప‌ర్ హిట్లు కొట్టిన ఘనత విజయశాంతి సొంతం. అందుకే టాలీవుడ్ లో ఈమెకు లేడీ అమితాబ్ అనే బిరుదు కూడా ఉంది. సోషల్ మీడియాలో విజయశాంతికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో వైరల్ గా మారింది.

ఆ ఫోటోలో విజయశాంతితో కలిసి ఉన్న ఆ బుడ్డ బాబుని మీరు గుర్తుపట్టారా ? ప్రస్తుతం ఆ బుడ్డోడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. ఇక పాన్ ఇండియా కాదు ఏకంగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తాజాగా తండ్రిగా కూడా ప్రమోషన్ అందుకున్నాడు. ఇప్పటికే ఆ బుడ్డోడు ఎవడో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక ఆ ఫోటోలో ఉన్న బుడ్డ‌ బాబు మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ఇక చిరంజీవి- విజయశాంతి కాంబోలో వచ్చిన పసివాడి ప్రాణం సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఫోటో అట ఇది. గతంలో చిరంజీవి- విజయశాంతి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. టాలీవుడ్ లోనే వీరికి సక్సెస్ఫుల్ జోడిగా పేరు ఉంది. అదే సమయంలో ఏమైందో ఏమో తెలియదు కానీ గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత చిరంజీవి- విజయశాంతి మళ్ళీ కలిసి పెద్దగా సినిమాలు చేయలేదు.

ఇక మళ్లీ ఎన్నో సంవత్సరాల తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు అక్కడ వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో చూసి అభిమానులు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. ఇక మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇక ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్న విజయశాంతి.. చిరంజీవి కూడా వరుస సినిమాను చేస్తూ అభిమానులు అలరిస్తున్నారు. ఇక మరి ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా వస్తుందో లేదో చూడాలి.