అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరోలలో టాలీవుడ్ లో నాగచైతన్య తాత, తండ్రి వారసత్వం కంటిన్యూ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. తాత నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున తరువాత టాలీవుడ్‌కు జోష్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో తన కెరీర్ లోనే తొలి బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అక్కినేని హీరో 100% లవ్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమాల తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేక పోయిన నాగ చైతన్య మళ్లీ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో తన కెరీర్ లోనే భారీ విజయం అందుకున్నాడు. నాగచైతన్య తన సినిమాల్లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించాడు. అయితే తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే తన మజీ భార్య సమంతనే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చైతన్య రీసెంట్గా నటించిన కస్టడి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇదే విషయాన్ని బయట పెట్టాడు.
అంతేకాకుండా సినిమాలలో ఆమె డెడికేషన్ అంటే చైతన్యకు ఎంతో ఇష్టమట. అంతేకాకుండా ఆమె అనుకుంటే ఏదైన కచ్చితంగా సాధిస్తుందని.. సినిమాలో ఆమె నటన అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ చైతు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా సమంతతో మూతిముద్దు అంటే నాకు ఎంతో నచ్చుతుంది అంటూ చైతు చెప్పాడు.
దీంతో విడాకులు తర్వాత కూడా సమంతని ఇంకా లైక్ చేస్తున్నాడు నాగచైతన్య అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వీరిద్దరి కాంబోలో ఏమాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ సినిమాలు వచ్చాయి. ఇందులో మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి