మొదటి పెళ్లి కంటే రెండో పెళ్లే బెస్ట్.. సునీత, దిల్ రాజు ప్రూవ్ చేసింది ఇదే కదా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఏ కారణం చేతనైనా రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయా సెలబ్రిటీల గురించి మీడియాలో వచ్చే వార్తలు హాట్ టాపిక్ అవుతుంటాయి. కొంతమంది సెలబ్రిటీల గురించి మీడియాలో ఏకంగా ఈ వయస్సులో రెండో పెళ్లి అవసరమా? అంటూ సెటైరికల్ కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే కొంతమంది సెలబ్రిటీలకు మాత్రం మొదటి పెళ్లితో పోల్చి చూస్తే రెండో పెళ్లి కలిసొస్తుండటం గమనార్హం.

సింగర్ సునీత గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సింగర్ సునీత మొదటి భర్తతో విడిపోయారనే సంగతి తెలిసిందే. 19 సంవత్సరాల వయస్సులోనే సునీత పెళ్లి చేసుకున్నారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత సునీతకు మొదటి భర్తతో అభిప్రాయ బేధాలు వచ్చాయి. భర్తతో విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలని చాలామంది సూచించినా సునీత మాత్రం ఆ నిర్ణయానికి దూరంగా ఉన్నారు.

అయితే పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్లను ఒప్పించి సునీత రెండో పెళ్లి చేసుకోవడం గమనార్హం. రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న సునీత పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు. సింగర్ సునీత సంసార జీవితం సాఫీగా సాగుతోందని తెలుస్తోంది. సింగర్ సునీత గర్భం దాల్చారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో కొన్నేళ్ల క్రితం మృతి చెందారు.

అయితే భార్య చనిపోయిన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న దిల్ రాజు ఆ తర్వాత తేజస్విని అలియాస్ వైఘారెడ్డిని వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం దిల్ రాజు తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఈ విధంగా సెలబ్రిటీలకు వేర్వేరు కారణాల వల్ల మొదటి పెళ్లి కలిసిరాకపోయినా రెండో పెళ్లి కలిసొస్తుండటం గమనార్హం.