మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఆమె అంతటి నటి. అంతేకాదు..చిత్ర సీమలో అందరితోనూకలివిడి గా ఉండే వారు. ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరించేవారు కూడా. కానీ, ఎవరితో ఎలా ఉన్నప్పటికీ.. షావుకారు జానకితో మా త్రం సావిత్రికి వివాదాలు వచ్చాయి. ఈ వివాదాలు జీవిత కాలం కొనసాగాయి అంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజమే. దీనికికారణం .. ఒక సందర్భంలో జానకే వివరించారు. “సావిత్రి నాకు చాలా జూనియర్. ఆమె సినీ రంగానికి వచ్చే సరికి నేను మంచి పొజిషన్‌లో ఉన్నాను“ అన్నారు.
అలాంటి సమయంలో.. సావిత్రి తన ఆఫర్లు కొట్టేశారనేది.. జానకి వాదన. ఇది కూడా నిజమేనని అనిపిస్తుంది. అనేక సినిమాల్లో సావిత్రి రాకముందు.. షావుకారు జానకి హీరోయిన్‌గా చేశారు. అన్నగారు ఎన్టీఆర్ మొదలు.. అక్కినేని నాగేశ్వరరావుతోనూ.. జానకి కలిసి పనిచేశారు. అలాంటి జానకికి అర్ధాంతరంగా సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. ఎవరిని పలకరించినా.. సావిత్రిమాటే చెప్పేవారు.
ఎవరి నోట విన్నా సావిత్రి జపమే కనిపించేది. అన్ని సినిమాల దారీ.. సావిత్రి ఇంటికే అన్నట్టుగా ఉండేది. ఒకానొక సమయంలో జానకి కనీసం క్యారెక్టర్ పాత్ర వేయాలన్నా ఎవరూ తీసుకోలేదు. ఈ బెడద.. ఒక్క షావుకారు జానకికే కాదు.. అంజలీదేవి, భానుమతి, ఎస్. వరలక్ష్మి వంటి అనేక మంది హీరోయిన్లకు ఎదురైంది. అయితే.. వారంతా సొంత బ్యానర్లు పెట్టుకుని సినిమాలు చేసుకున్నారు. అయితే, జానకి సొంత గా సినిమాలు చేయలేదు. దీంతో దాదాపు ఐదేళ్లపాటు జానకి ఖాళీగానే ఉండిపోయారంటే.. ఆశ్చర్యం వేస్తుంది.
ఇదంతా కూడా.. కొందరు క్యాష్ చేసుకున్నారు. సావిత్రి ఉద్దేశ పూర్వకంగానే జానకిని తొక్కేస్తోందని ప్రచారం చేసుకొచ్చారు. ఇక, గ్యాసిప్‌లు కూడా ఇలానే ఉండేవి. సావిత్రి వర్చస్సుకు.. జానకి వర్చస్సుకు తేడా ఉందని, అందుకే దర్శకులు జానకికి ఆఫర్లు ఇవ్వడం లేదని కూడా ప్రచారం జరిగింది. ఇలా.. మొదలైన వివాదం.. జీవితకాలం సాగిందని.. అయితే.. సినీ రంగంలో ఎవరూ పర్మినెంట్ కాదని జానకి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సావిత్రి మంచి హృదయం ఉన్న నటి అని కితాబునిచ్చారు.