భోళా శంక‌ర్ టీజ‌ర్‌… రాడ్ రంబోలా అంటే ఇదే ( వీడియో )

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల ప‌రంప‌ర‌లో భోళా శంక‌ర్ కూడా ఒక‌టి. గ‌తేడాది ఆచార్య‌, గాడ్‌ఫాద‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిరంజీవి రెండు సినిమాల‌తో పూర్తిగా డిజ‌ప్పాయింట్ చేశాడు. ఇక ఈ యేడాది సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మెప్పించాడు. ఈ సినిమా సూప‌ర్ హిట్. చాలా త‌క్కువ టైంలోనే చిరు మ‌రోసారి భోళాశంక‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

ఈ సినిమాపై ముందు నుంచి స‌గ‌టు టాలీవుడ్ సినీ అభిమానుల్లోనే కాకుండా.. మెగా వీరాభిమానుల్లోనే చాలా సందేహాలు ఉన్నాయి. ఇది ఆల్రెడీ త‌మిళంలో ఎప్పుడో అజిత్ హీరోగా వ‌చ్చిన సినిమా. వేదాళం సినిమా అంటేనే ఓ కుక్క రాడ్ సినిమా. పైగా దానిని తెలుగులో కూడా డ‌బ్బింగ్ చేసి వ‌దిలారు. యూట్యూబుల్లో కొన్ని వంద‌ల సార్లు అంద‌రూ చూసేశారు.

తెలుగులో టీవీల్లో కూడా ఈ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా స్టోరీనే కాస్త అటూ ఇటూ మార్చి ఇప్పుడు భోళాశంక‌ర్‌గా తీస్తున్నారు. పైగా ఈ సినిమా డైరెక్ట‌ర్ టాలీవుడ్లో శ‌క్తి, షాడో, కంత్రి లాంటి భయంక‌ర‌మైన డిజాస్ట‌ర్లు ఇచ్చిన మెహ‌ర్ ర‌మేష్‌. టీజ‌ర్ మొత్తం సిస్ట‌ర్ సెంటిమెంట్‌తో ఉంటుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

టీజ‌ర్‌లో చిరు చెల్లి కీర్తి సురేష్‌తో పాటు హీరోయిన్ త‌మ‌న్నా లుక్స్ చూపించారు. ఇక కీర్తి సురేష్ ల‌వ‌ర్‌గా అక్కినేని హీరో సుశాంత్ క‌నిపించాడు. ఇక క‌థా ప‌రంగా, క‌ట్స్ ప‌రంగా యాక్ష‌న్ ప‌రంగాను టీజ‌ర్‌లో ఏ మాత్రం కొత్త‌ద‌నం లేదు. స్టేట్ డివైడ్ అయినా అంద‌రూ నా వాళ్లే.. హ‌ద్దుల్లేవ్‌.. స‌రిహ‌ద్దుల్లేవ్ అంటూ చిరు చెప్పే డైలాగ్ టీజ‌ర్‌కే హైలెట్‌.

ఇక మెహ‌ర్ ర‌మేష్ ప‌దేళ్ల త‌ర్వాత అది కూడా షాడో లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది.
టీజ‌ర్ అయితే సినిమాకు ఏమంత హైప్ ఇవ్వ‌లేదు. ఒక‌వేళ రేపు సినిమా ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.