ఆ ఉచ్చులో అషురెడ్డి… వంద‌ల ఫోన్ కాల్స్‌… ఆ హాట్ హీరోయిన్ కూడా…!

టాలీవుడ్ ను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసిన మత్తు దందా వెనక పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. కబాలి తెలుగు సినిమా నిర్మాత సుంక‌ర కృష్ణ‌ప్ర‌సాద్ అలియాస్ కెపి చౌదరి సాగించిన ఈ డ్ర‌గ్స్ దందా వెన‌క ఉన్న వారి జాబితాను కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. కేపీ చౌదరి నుంచి కొకైన్ కొనుగోలు చేసిన వారి జాబితా గూగుల్ డ్రైవ్ లో ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు. వారి వివరాలు ఫోటోలతో సహా బయటపడ్డాయి.

వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 మంది సినీ టీవీ నటులతో పాటు మోడల్స్, వ్యాపారులు ఉన్నారు. వారిలో చాలామంది పేర్లు ఉన్నా కూడా సినిమా రంగానికి చెందిన ఇద్దరు నటీమణులు పేర్లు ఉండటం ఇప్పుడు సినిమా రంగంలో కలకలం రేపుతుంది. వీరంతా స్నేహిత హిల్స్‌లోని సిక్కిరెడ్డి నివాసంలో వేడుకలు చేసుకుంటూ కోకైన్ తీసుకునే వార‌ని ఆధారాలు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు సినీ దర్శకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

కేపీ చౌదరి 4 సెల్ ఫోన్లలో వందల మంది ప్రముఖుల ఫోన్ నెంబర్లు ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమందితో అయితే గత నాలుగైదు నెలల నుంచి చాలాసార్లు ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే ఇతడు బ్యాంకు ఖాతాల ద్వారా లక్షలాది రూపాయల లావాదేవీలు జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఇక సినీనటి అషురెడ్డితో చౌదరి ఎక్కువసార్లు ఫోన్లో మంత‌నాలు జరిపినట్టు సమాచారం.

అశోక్ రెడ్డి కూడా ఈ డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకోవడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగే హైదరాబాదులోని డాక్టర్ సుధీర్, హాట్ సినీ తార జ్యోతితో కూడా కేపీ చౌదరి ఎక్కువగా ఫోన్లో సంభాషణలు జరిపినట్టు తెలుస్తోంది. ఇప్పుడు డ్రగ్స్ కేసులో అషురెడ్డితో పాటు జ్యోతి పేర్లు బయటికి రావడంతో ఇందులో వారి ప్రమేయం ఏమైనా ఉందా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇక అషురెడ్డికి చౌదరి నుంచి 100కు పైగా ఫోన్ కాల్స్ ఎందుకు ? వెళ్లాయి అన్నదానిపై పోలీసులు ఆరాలు తీస్తున్నారు. అలాగే మరొక నటి సురేఖవాణి ఫోటోలు కూడా కేపీ చౌదరి దగ్గర ఉండడంతో ఈ ముగ్గురి నటిమ‌ణులకు ఉన్న సంబంధాలు ఏమిటి అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.