సూర్యాకాంతంకు పేకాట పిచ్చి… ఆ న‌టుడితో క‌లిస్తే గేమ్‌లో ర‌చ్చ రంబోలాయే…!

సూర్యాకాంతం.. వెండి తెర‌మీద ఎంత గ‌య్యాళిగా న‌టించేవారో.. అందరికీ తెలిసిందే. గ‌య్యాళి అత్త‌గానే కాదు… భార్య‌గా, కోడ‌లిగా కూడా.. సూర్యాకాంతం అనేక పాత్ర‌లు పోషించి.. మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. తెర‌మీద అంత కోపం ఉన్నా.. ఆఫ్‌ది స్క్రీన్‌.. అత్యుత్త‌మ ఇల్లాలిగా.. స్నేహితురాలిగా పేరు తెచ్చుకున్నారు. అంత‌కుమించి.. ఆమెకు పుస్త‌కాలంటే ప్రాణం. అదేవిధంగా పిండివంట‌లు…. ఊర‌గాయ లు అంటే.. మ‌క్కువ‌.

ఎన్టీఆర్‌తో సూర్యాకాంతం న‌టించిందంటే… కృష్ణా జిల్లా నుంచి ప్ర‌త్యేకంగా సూర్యాకాంతం కోసం.. వెన్క తెప్పించి ఇచ్చేవారు ఎన్టీఆర్. ఆ వెన్న‌తో సూర్యాకాంతం అనేక వంట‌కాలు చేసి.. త‌ర్వాత మ‌ళ్లీ ఎన్టీఆర్ తో తినిపించేవారు. ఇలా.. సినీ రంగంలో కుటుంబం సంబంధాలు ఏర్పాటు చేసుకుని మ‌రీ.. ముందుకు సాగారు.. సూర్యాకాంతం. అయితే.. ఎంత ఎత్తుకు ఎదిగిన వ్య‌క్తికైనా.. ఎక్క‌డో చిన్న వెలితి ఉంటుంద‌న్న విధంగా సూర్యాకాంతం విష‌యంలోనూ.. ఒక మైన‌స్ ఉంది.

ఆమెకు పేకాట అంటే.. మ‌హా పిచ్చి. త‌న వెంటే కార్డులు పెట్టుకుని తిరిగేవారు. అంతేకాదు.. షూటింగు గ్యాప్‌లో కూడా.. ఆమె కార్డుల‌ను తిర‌గేసేవారు. అయితే.. రామారావు షూటింగు అంటే మాత్రం కొంత మేర‌కు సూర్యాకాంతం జాగ్ర‌త్త‌గా ఉండేవారు. ఆయ‌నంటే.. గౌర‌వంతో కూడిన భ‌క్తి కార‌ణ‌మ‌ని అనేవారు. ఇక రేలంగి హాస్య‌న‌టుడే కాకుండా.. వ్యాపార వేత్త‌గా కూడా ఎదిగారు. అనేక మందికి ఆయ‌న స‌ల‌హాలు ఇచ్చేవారు.

ఈయ‌న‌కు కూడా పేకాట పిచ్చి ఉండేది. ఇక‌, సూర్యాకాంతం ఆయ‌న క‌లిస్తే… పేకాట ప్రియులు క్ల‌బ్‌కు వ‌చ్చారా? అనేలా ఉండేద‌ట‌. అయితే.. ఎల్వీ ప్ర‌సాద్.. వంటి సీనియ‌ర్లు ఉన్న‌ప్పుడు మాత్రం సూర్యాకాంతం కానీ.. రేలంగి కానీ.. చాలా జాగ్ర‌త్తలు తీసుకునేవారు. నిజానికి వీరు అగ్ర‌తార‌లే అయినా.. విన‌య విధేయ‌త‌ల‌ను ప్ర‌ద‌ర్శించేవారు.