చిరంజీవి ప్లాప్ సినిమా వెంక‌టేష్ చేస్తే సూప‌ర్ హిట్ అయ్యేదా… ఆ ట్విస్ట్ ఇదే…!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం ఉండదు. చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో వైవిద్యమైన సినిమాల్లో కూడా నటించారు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇదే సమయంలో చిరంజీవి 2001లో డాడీ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో తండ్రీ కూతుర్ల అనుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు.

daddy cinema in telugu - OFF-56% >Free Delivery

ఈ సినిమా ఆ రోజుల్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా.. చాలామందికి ఇష్టమైన సినిమాగా నిలిచిపోయింది. ఆదే సమయంలో ఈ సినిమాని ముందుగా దర్శకుడు భూపతి రాజు చిరంజీవికి చెప్పారట. దాంతో చిరు ఈ సినిమా నాకు సూట్ అవ్వదు.. ఎందుకంటే ఈ సినిమాలో నన్ను జైల్లో పెట్టడం, కూతురు చావుకు నేను కారణం అవటం అనేవి నా అభిమానులకు నచ్చవు ఇలాంటి సన్నివేశాలో నా అభిమానులు నన్ను చూడలేరు అని చిరంజీవి చెప్పుకొచ్చారట.

ఇక దీంతో టాలీవుడ్‌ ప్రముఖ కెమెరామెన్ చోటా కె. నాయుడు, దర్శకుడు భూపతి రాజు చిరంజీవిని బలవంతంగా ఒప్పించి ఈ సినిమా చేశారట. ఇప్పుడు వరకు మీరు ఇలాంటి కథను చేయలేదు.. మీకు కూడా కొత్తగా ఉంటుంది.. మీకైతేనే ఈ కథ బాగా సూట్ అవుతుందని చెప్పి మరి ఒప్పించారట. అంత చెప్పినా కూడా చిరంజీవి ఈ స్టోరీ నాకన్నా వెంకటేష్ కే బాగుంటుందని చెప్పారట.

Daggubati Venkatesh Height, Weight, Age, Wife, Biography & More »  StarsUnfolded

ఇక చిరంజీవి అన్నట్టుగానే ఈ సినిమా రిలీజ్ అయ్యాక విక్టరీ వెంకటేష్ స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి సినిమా అయితే చాలా బాగుంది.. కానీ ఇందులో మీకన్నా నేనైతే చాలా బాగుంటానని అన్నారట. చిరంజీవి ముందు నుంచి అనుకుంటున్న దాని ప్రకారమే వెంకటేష్ అనడంతో చిరంజీవి ఆలోచన మరోసారి కరెక్ట్ అయిందిని తేలిపోయింది. అలా వెంకటేష్ చేయాల్సిన సినిమాలో చిరంజీవి నటించి అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయారు.