గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను చిత్ర పరిశ్రమలో హిట్ పుట్టిస్తుంది మిల్కీ బ్యూటీ తమన్న పేరు. ఇక ఈమెతో పాటు బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మ పేరు కూడా అదే స్థాయిలో మారుమ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్న సమయంలో ఈ ఇద్దరు కలిసి నటించిన లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా రీసెంట్ గానే ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
ఆ ట్రైలర్ చూస్తుంటేనే తమన్నా- విజయ్ ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సిరీస్లో తమన్నా కూడా చాలా బోల్డ్‌గా కనిపించబోతుంది. అంతేకాకుండా ఈ సిరీస్లో తమన్నా ఒక పెళ్లైన వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంటుంది. ఆ సమయంలో అతను కౌగిలించుకోవడానికి వస్తే ఈమె అతన్ని పక్కకు నెట్టేస్తుంది. పెళ్లయిన మగవాడితో నేను అలాంటి పనులు చేయలేను అని అంటుంది.
తమన్నా- విజయ్ వర్మ కలిసిన నటించిన ఈ సన్నివేశాలు చూస్తుంటే డేటింగ్ లో ఉండి ఇద్దరూ ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. విజయ్, తమన్నా కెమిస్ట్రీ హైలైట్ అవుతుంది. సిరిస్ పాపులర్ కావడానికి తమన్నా మరియు విజయ్ ఈ డ్రామాలో నటించడమే అని బాలీవుడ్ సర్కిల్‌లలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.