తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్. ఈ తార ప్లే బ్యాక్ సింగర్ గా కూడా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ కమల్‌హాసన్ వారసురాలుగా సినిమా ఇంట్రెస్ట్ లోకి ఈజీగా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తన టాలెంట్ తోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే ప్రొఫెషనల్ లైఫ్‌లో ఈ ముద్దుగుమ్మ చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు ఎల్లప్పుడూ టచ్ లో ఉంటుంది.
అప్పుడప్పుడు ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా నిర్వహిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ క్వశ్చన్లకు సమాధానం చెప్పింది. ఈ సమయంలోనే ఆమెకు ఒక వింత ప్రశ్న ఎదురయింది. సాధారణంగా వేరే హీరోయిన్ అయితే ఈ ప్రశ్న దాటవేసేది. కానీ శ్రుతి కాబట్టి ఈ ప్రశ్నకు చాలా బోల్డ్‌గా, పబ్లిక్‌గా ఆన్సర్ చెప్పి అందరి చేత దటీజ్ శ్రుతిహాసన్ అనిపించుకుంది.
ఇంతకీ ఆ నెటిజన్ అడిగిన ప్రశ్న అడిగిన ప్రశ్న ఏంటంటే, “మీరు మద్యం తాగుతారా?” అని సూటిగా ప్రశ్నించాడు. దానికి ఈ గబ్బర్ సింగ్ నటి సమాధానం ఇస్తూ ” నేను మద్యం తీసుకోను, డ్రగ్స్ కి కూడా దూరంగా ఉంటాను” అని చాలా హుందాగా తెలిపింది. ఈ ఆన్సర్ విన్న తర్వాత శ్రుతి పట్ల తమకు చాలా గౌరవం పెరిగిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ జంటకు భారీ చిత్రం సలార్ లో ఈ అమ్మడు నటిస్తోంది. ఇది తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో త్వరలోనే రిలీజ్ కానుంది.