ఈ పై ఫోటోలో ఉన్న పాప టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తుపట్టారా..!

సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి మనకు అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటూ ఉంటాం.కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం సెలబ్రిటీల ఫోటోలు చూస్తే అస్సలు గుర్తు పట్టలేము. ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు ఎలా ఉంటారో అందరికీ తెలుసు.కానీ ఇండస్ట్రీలోకి రాకముందు వారి ముఖాలు గుర్తుపట్టలేనంతగా తేడాగా ఉంటాయి అని చెప్పాలి.

ఇక సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి.

ఇక ఈ క్ర‌మంలోనే పై ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఓ స్టార్ హీరోకిి భార్య ..బడా కుటుంబంలోనే కీలకమైన వ్యక్తి.. కొన్ని వేల కోట్ల ఆస్తులకు అధిపతిరాలు. ఇక రీసెంట్ గానే ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారింది. ఇప్పటికీ ఫోటోలో ఉన్న పాపని గుర్తుపట్టలేకపోతున్నారా..ఈ ఫోటోలో ఉన్న చిన్న పాప మరి ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.

మెగాస్టార్ చిరంజీవి కోడలు.. ప్రస్తుతం ఈ మెగా కోడలు ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు గ‌త‌10 సంవత్సరాలకు ఎదురుచూస్తున్న ఆనందాన్ని ఇప్పటికి తీసుకువచ్చింది. ఈనెల 20న ఉపాసన డెలివరీ జరగడంతో పాప‌ జన్మించింది. దీంతో మెగా కుటుంబంలో మహాలక్ష్మి పుట్టిందంటూ సంబరాలు మొదలయ్యాయి.

రామ్ చ‌రణ్ ఐపాస‌న‌లకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో భాగంగా ఉపాసన చిన్నప్పటి ఫోటోను వైరల్ చేస్తూ రామ్ చరణ్‌కు పుట్టిన పాప కూడా ఇలాగే ఉంటుందంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి కొద్ది సేపట్లోనే ఈ మెగా కోడలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాబోతోంది. ఈ సమయంలో ఈ మెగా మనవరాలు ఫోటో బయటకు వస్తుందా లేదా అనేది చూడాలి.