నందమూరి బాలకృష్ణ..ఈ పేరు వినగానే జై బాలయ్య అనాల్సిందే. ఈయన సోషల్ మీడియాకి కొంచెం దూరమే ఉంటారు. కానీ ఈయనపై సోషల్ మీడియాలో ఎప్పుడు వార్తలు హాట్ టాపిక్ గానే ఉంటాయి. బాలకృష్ణ సినీమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. సినిమాల్లోనే కాదు పాలిటిక్స్ లో కూడా బాలకృష్ణ బిజీబిజీగా ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు తన కొడుకు మోక్షాజ్ఞని ఇండస్ట్రీలో పరిచయం చేయాలనుకున్నాడు. త్వరగాలోనే గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు బాలకృష్ణ గురించి సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది. అదేంటో తెలుసుకుందాం.
బాలకృష్ణ తనతో కలిసి నటించిన హీరోయిన్ కి బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ గా ఇచ్చారనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది కూడా ఒక్క సినిమా కలిసి నటించిన హీరోయిన్ కి అనే వార్త మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక్క సినిమాకే ఇంత కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి అని అందరు ఆలోచిస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అంజలి.
అంజలి బాలకృష్ణతో కలిసి డిక్టేటర్ సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాక బాలయ్య బాబు అంజలికి ఇష్టమైన బిఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ గా ఇచ్చారంట. ఈ వార్త విన్న వాళ్ళందరూ ఒక్క సినిమాకి కలిసి నటించినందుకు అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారా, ఏంటో అంత స్పెషల్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు. అంజలి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.