టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా స్పై. అదిరిపోయే యాక్షన్ థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూవీగా స్పై తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా కార్తీకేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నటిస్తోన్న ఈ స్పై పై భారీ అంచనాలే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు లాంఛ్ చేశారు. హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో జరిగిన ఈవెంట్‌లో ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు దాస్తుంది, దానికి సమాధానం మనమే వెతకాలి అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో చాలా ఇంట్రస్టింగ్‌గా ఈ స్పై ట్రైలర్ మొదలవుతుంది. సుభాష్ చంద్రబోస్ యొక్క రహస్య కథ మరియు రహస్యాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
నిఖిల్ జై అనే కుర్రాడి పాత్రలో కనిపించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రహస్య ఫైళ్లను దొంగిలించిన కదీర్ అనే ఓ నేరస్థుడిని పట్టుకునే ఆపరేషన్‌లో బిజీగా ఉంటాడు నిఖిల్. అలాగే తన సోదరుడు ఆర్యన్ రాజేష్ ని ఎవరు చంపారో తెలుసుకోవడానికి నిఖిల్ అన్వేషణ కొనసాగిస్తూ ఉంటాడు. యాక్షన్ థ్రిల్లింగ్, ఫైట్స్ వంటి అంశాలతో ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్‌గా కట్ చేశారు.
ఇక చివర్లో ప్రత్యేక పాత్రలో నటించిన కుర్ర హీరో రానా చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సినిమాపై మరింత ఇంట్రస్ట్ పెంచేసింది. ఈ నెల 29న స్పై సినిమా రిలీజ్ అవుతోంది. ఏదేమైనా స్పై ట్రైలర్ అయితే టాలీవుడ్‌లో అంచనాలు మరింత పెంచేసింది. టాలీవుడ్‌కే కాదు పాన్ ఇండియా లెవల్లో సరైన హిట్ పక్కా అన్న టాక్ అయితే ముందుగానే వచ్చేసింది.