ప్రభాస్ ‘ ప్రాజెక్టు కే ‘ అస‌లు టైటిల్ రివీల్‌… ఫ్యీజులు ఎగిరిపోవాల్సిందే..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాహుబలి సినిమాల తర్వాత వరుసగా భారీ సినిమాలు చేసుకుంటూ ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆయన ఎన్ని సినిమాలు చేసిన త‌న స్థాయికి త‌గ్గ హిట్ మాత్రం రావట్లేదు. రీసెంట్‌గా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్రభాస్‌కు నిరాశ మిగిల్చింది.

Shocking developments in Project K | cinejosh.com

దీంతో ప్రభాస్ అభిమానులు ఈ నిరాశ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ సలార్ , ప్రాజెక్ట్ కె సినిమాల మీదే ఉన్నాయి. స‌లార్‌ టీజర్ కూడా జూలై 7 న ప్రేక్షకుల‌ ముందుకు వ‌స్తోంది. ఇదేకాకుండా మరో సినిమా అప్డేట్ కూడా వచ్చే నెలలోనే ఉండబోతుందన్న ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా దీపికా పదుకొనె నటిస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మహానటి లాంటి మెంబర్ బుల్ సినిమా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమా వస్తోంది. టైం ట్రావెల్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఒకీలక పాత్రలో నటిస్తున్నాడు.

Project K: Prabhas, Deepika Padukone-starrer gets new poster, release date  - Hindustan Times

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతి నాయకుడుగా నటించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వచ్చే నెలలో ప్రాజెక్ట్ కే వర్జినల్ టైటిల్‌ను మేకర్స్ రివిల్ చేయనున్నారట. ప్రాజెక్ట్ కే అనేది వర్కింగ్ టైటిల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్.. ఎట్టకేలకు ఆ వర్కింగ్ టైటిల్ నుంచి అభిమానులకు విముక్తి కలిగించనున్నాడట.

టైటిల్ మోషన్ పోస్టర్ జూలైలో అమెరికాలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ వార్త‌ నిజమైతే ప్రభాస్ అభీమానుల‌కు వచ్చే నెలలో రెండు భారీ పండగలు వచ్చినట్టే. ఇక త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికార ప్రకటన చేస్తుందో లేదో చూడాలి.