టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్- బోయపాటి కాంబో కూడా ఒకటి. ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని పవన్ అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. గతంలో పవన్ అభిమానులు కూడా ఆయన్ని పక్కా మాస్ లుక్ లో చూడాలని అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. అప్పుడు వరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ తిరగరాసింది. ఇలాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే డివివి దానయ్యతో ఒక సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు.
అదే సమయంలో దానయ్య – బోయపాటి దగ్గర ఉన్న ఓ మంచి స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ కు వినిపించారు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథ లేదని కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకు రమ్మన్నాడు పవన్.. ఇక బోయపాటి శ్రీను కూడా అలాగే అని చెప్పి పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వాజ్ కు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేసి మరోసారి పవన్ కు కథ వినిపించాడు. ఎందుకో ఆ పవన్ కళ్యాణ్‌కు ఆ ఊర మాస్ కథ నచ్చలేదు తన నిర్ణయం తర్వాత చెప్తాను అని బోయపాటికి చెప్పి వెళ్లిపోయాడు.
ఇక అదే సమయంలో పూరి జగన్నాథ్ తో కెమెరామేన్ గంగతో రాంబాబు స్టోరీ విని ఆ సినిమాకు ఓకే చేశాడు. అదే సమయంలో పవన్- బోయపాటికి ఫోన్ చేసి మీరు చెప్పిన కథ నాకు నచ్చింది.. కానీ నా బాడీ లాంగ్వేజ్ కి ఆ స్టోరీ సూట్ అవ్వదు.. అందుకే నేను ఆ సినిమా చేయలేను ఈ సినిమా బాలయ్య బాబుకైతే బాగా సూట్ అవుతుంది. ఆయనతో మీరు సినిమా చేయండి అని సలహా ఇచ్చారట. ఆ తర్వాత అదే కథతో బోయపాటి, బాలయ్యతో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు సింహ. పవన్ కళ్యాణ్ కారణంగా బాలయ్యకు ఇలాంటి బంపర్ హిట్ సినిమా వచ్చింది. తర్వాత పవన్ బోయపాటికి పోన్ చేసి నాకు తగ్గ కథని రాయండి.. మీ దర్శకత్వంలో సినిమా చెయ్యాలని నాకు కూడా ఉంది అని బోయపాటి కి చెప్పాడట పవన్. కానీ వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటికీ కూడా ఏ సినిమా సెట్ అవ్వలేదు.