మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్- ఉపాసన దంపతులు రీసెంట్ గానే తల్లిదండ్రైన సంగతి తెలిసిందే. ఈనెల 20న తెల్లవారుజామున 1:45 గంటలకు ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో మెగా కుటుంబం, మెగా అభిమానులు గత 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వేళ రావటంతో వారు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా ఈ మెగా కోడలకు పిల్లలు ఉంటే ఎంతో ఇష్టం. ఇదే విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పిల్లల పెంపకంం గురించి ఉపాసన మాట్లాడిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అలాగే ఆమెకు ఫ్యాషన్ సెన్స్ కూడా అందరికంటే చాలా ఎక్కువ. డెలివరీకి ముందు రోజు ఉపాసన హాస్పటల్ కి వెళుతున్నప్పుడు ఆమె ధరించిన టీషర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. డెలివరీ అయ్యే సమయంలో కూడా ఆమె ఫ్యాషన్ నాలెడ్జ్ ఆకట్టుకునేలా ఉందని… ఆమె వేసుకున్న టీ షర్ట్ గురించి అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఉపాసనకు ఫ్యాషన్ పట్ల ఉన్న తన అభిమానాన్ని అందరికీ తెలిసే విధంగా ఆమె ఈ టీషర్ట్ ధరించింది.
అంతేకాకుండా కాస్ట్‌లీగా ఉండాలని డెలివరీ సమయంలో కూడా ఉపాసన అదే డ్రెస్ సెన్స్ ఫాలో అయింది. డెలివరీకి ఒక రోజు ముందు ఉపాసన ఆసుపత్రిలో చేరింది. ఆమె వెళ్లిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె ధరించిన టీ షర్ట్ గురించి ఆరా తీసారు.
ఆమె ధరించిన బేబీ పింక్ కలర్ టీ షర్ట్ గూచీ కంపెనీకు చెందినదిగా గుర్తించారు నెటిజన్స్. ఆ టీ షర్ట్ ధర అక్షరాలా రూ. 48 వేలు అని టాక్. ఇప్పుడు ఆ టీ షర్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాసన తన ప్రెగ్నెంట్ అయిన సమయం నుంచి ఈవెంట్ జరిగిన ఎక్కువగా బేబీ పింక్ కలర్ దుస్తుల్లోనే ధరించి కనిపించింది.
ఇక డెలివరీకు ముందు రోజు ఆసుపత్రికి వెళ్తున్నపుడు కూడా బేబీ పింక్ కలర్ టీ షర్ట్ ను ధరించి పుట్టబోయేది అమ్మాయేనని హింట్ ఇచ్చిందని అంటున్నారు. ఏదేమైనా ఉపాసన ప్రతీసారి తన ష్యాషన్ సెన్స్ తో అందరి దృష్టినీ ఆకర్షిస్తుందనే చెప్పాలి.