కాబోయే మెగా చిన్న కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న లావణ్య త్రిపాఠి సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు రీసెంట్గా ఈమె సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.
ఇంతకీ ఆ ఫోటో ఏమిటో ఒకసారి చూద్దాం రండి. లావణ్య త్రిపాఠి తన ఫోన్ వాల్ పేపర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అందులో తన పేరెంట్స్.. తనకు కాబోయే అత్తవారింటి ఫోటోలతో పాటు తన స్నేహితులతో ప్రత్యేక సందర్భాల్లో దిగిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. ఇక అంతే కాకుండా ఆ ఫోటోలలో తనకు కాబోయే భర్త వరుణ్‌తో దిగిన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో కూడా కనిపించింది.
ఆ ఫోటోపై మై లవ్స్.. డ్రీమ్ బిగ్గర్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. నెటిజన్లు కూడా ఆ ఫోటోకి క్యూట్ జోడి అంటూ అదిరిపోయే కామెంట్లు కూడా ఇస్తున్నారు. మొత్తానికి మెగా కోడలు ముందే అత్తింటి వాళ్లను తన బుట్టలో వేసుకుంటోంది అన్న కామెంట్లు కూడా వస్తున్నాయి.
ఇక లావణ్య- వరుణ్ తేజ్ పెళ్లికూడా ఈ ఏడాది చివర్లోనే జరగనుంది. ఇప్పటికే మెగా కుటుంబంలోకి రామ్ చరణ్- ఉపాసనల పాప కూడా అడుగుపెట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు తొందరలోనే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి కూడా జరిగితే మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు ఉండవు.