రజినీకాంత్‌తో ఉన్న ఈ పాప ఓ స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా..!

ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆ హీరో చేసిన సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. షాక్ అయ్యారా. అవును నిజమే. ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్, హీరోయిన్ అనుకుంటున్నారా, ఎవరితో నటించిందో ఇంకా గుర్తుకు రాలేదా ? రండి ఒకసారి చూసేద్దాం. సూపర్ స్టార్ట్ రజినీకాంత్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కండక్టర్ నుంచి స్టార్ హీరోగా వచ్చి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు.

Muthu Songs Download - Free Online Songs @ JioSaavn

 

ఏంటి సడెన్ గా రజినీకాంత్ గురించి చెబుతున్నాం అనుకుంటున్నారా? అవును ఆ చైల్డ్ ఆర్టిస్ట్ రజినీకాంత్ సినిమాలోనే ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇంకెవరో కాదు.. మీనా సాగర్‌. మీనా సాగర్‌..1982లో వచ్చిన ‘నెంజంగల్‌’ అనే తమిళ సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత రజినీకాంత్ చేసిన సినిమాలో హీరోయిన్ గా కూడా కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళంలోనే కాదు తెలుగు, హింది, మలయాళంలో కూడా నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 20 కి పైగా సినిమాల్లో చేసారు.

ఆ తరువాత తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారారు. హీరోయిన్‌గా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో చాలా సినిమాల్లో ఆమె చేసారు. చిరంజీవి, రజినీకాంత్‌, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి స్టార్ లతో మీనా సాగర్‌ స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ఎన్నో హిట్టు సినిమాల్లో నటించింది. 2009లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన విద్యాసాగర్‌ను పెళ్లి చేసుకుంది.

Meena's husband Vidyasagar passes away - The Hindu

ఇప్పుడు మీనా సాగర్‌ కి ఒక కూతురు కూడా ఉంది. కూతురు పేరు నైనిక. అయితే 2022లో మీనా సాగర్‌ భర్త విద్యాసాగర్‌ అనారోగ్య కారణాల వల్ల మరణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మీనా సాగర్‌ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చిన మీనా సాగర్‌ తమిళంలో రౌడీ బేబీ అనే సినిమాలో నటిస్తున్నారు.