సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ నిత్యం జరిగే దారుణాలు గురించి ప్రశ్నిస్తూనే ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో తనతో పాటు ఎందరికో జరిగిన అన్యాయాలను ఆమె ఎన్నోసార్లు గొంతెత్తి మరీ ప్రశ్నించింది. అయితే నటుడు, దర్శకుడైన రాహుల్ రవీంద్రన్‌ను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందేగా. వీరు గతేడాది కవలకు జన్మనిచ్చారు. ఈ ట్విన్స్ లో ఒక పాప, ఒక బాబు ఉన్నారు.
అయితే పిల్లను పుట్టినప్పటినుంచి వీరి పిల్లలను, లేదా పిల్లల ఫోటోలను కూడా ఎవ్వరికి చూపించలేదు. అయితే ఇప్పుడు చిన్మయి పిల్లల మొక్కలను అభిమానులకి పరిచయం చేసింది. ఈ ఫోటోలు చూపించిన కొద్దీ క్షణాల్లోనే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చుసిన అభిమానులందరూ పిల్లలు చాలా బాగున్నారు, సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే గతంలో చిన్మయి మీద ఎన్నో రూమర్స్ వచ్చిన విషయం కూడా అందరికి తెలిసిందే. నిత్యం జరిగే దారుణాలపై స్పందిస్తూనే ఉంటుంది. చిన్మయి ప్రెగ్నెన్సీపై కూడా ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె సరోగసీ ద్వారా పిల్లలకు జన్మినిచ్చారని వచ్చిన వార్తలు నెట్టింట హాల్ చల్ చేసాయి.
అప్పుడే చిన్మయి తన బేబీ బంప్ ఫోటోలతో వాటికి చెక్ పెట్టింది. అప్పుడే తన పిల్లలను చూపించనని కూడా చెప్పింది. పర్సనల్ విషయాల విషయంలో , కుటుంబం విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. అయితే సంవత్సరం తరువాత పిల్లల ఫోటోలను షేర్ చేసింది.